Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీని ఓదార్చిన సంజూ శాంసన్!(వీడియో)

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా..వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లో మోస్తారు ప్రదర్శన కనబర్చింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో మాంచెస్టర్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టీ20లో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ముఖ్యంగా భారత బ్యాటర్లు నెట్స్‌లో ముమ్మర సాధన చేశారు.

ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ అరంగేట్రం కోసం సిద్దంగా ఉన్నాడు. అభిమానులు కూడా వైభవ్ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అతనికి తుది జట్టులో అవకాశం రావడానికి మరికొంత సమయం పడుతుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హింట్ ఇచ్చారు.

వైభవ్‌కు చోటివ్వకపోవడమే న్యాయం, ధర్మం: టీమిండియా బౌలింగ్ కోచ్

వైభవ్‌కు చోటివ్వకపోవడమే న్యాయం, ధర్మం: టీమిండియా బౌలింగ్ కోచ్

ప్రాక్టీస్‌లోనూ దక్కని అవకాశం..

ప్రాక్టీస్ సెషన్‌లో వయసులో చాలా చిన్నవాడైన వైభవ్‌ సూర్యవంశీని జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. అయితే శనివారం ఉదయం జరిగిన నెట్ ప్రాక్టీస్‌ సెషన్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. దాంతో వైభవ్ సూర్యవంశీకి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు తగిన సమయం దొరకలేదు.

IND vs ENG T20 Sanju Samson Wins Hearts by Consoling Young Prodigy Vaibhav Sooryavanshi After Net Session Disappointment

ఓదార్చిన సంజూ శాంసన్..

ప్రాక్టీస్‌కు కూడా అవకాశం రాకపోవడంతో వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. నెట్స్ బయట ఒంటరిగా కూర్చొని విచారంగా కనిపించాడు. వైభవ్ నిరాశను గమనించిన సంజూ శాంసన్ వెంటనే అతని వద్దకు వెళ్లి ఓదార్చాడు. అతని భుజంపై చేయి వేసి ప్రేమగా మాట్లాడాడు. 'తమ్ముడూ.. అవకాశం రాలేదని బాధపడకు.. నీ సమయం కచ్చితంగా వస్తుంది. అప్పుడు నిన్ను ఎవరూ అడ్డుకోలేరు. ఎంతసేపైనా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఎప్పుడూ నవ్వుతూ ఉండు.’అని సంజూ శాంసన్ ధైర్యం చెప్పాడు.

అంతేకాకుండా, 15 ఏళ్ల చిన్న వయసులోనే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ఒక గొప్ప అవకాశమని శాంసన్ గుర్తుచేశాడు. ఈ అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాలని, ఇక్కడి అనుభవం జీవితాంతం గుర్తుంటుందని సలహా ఇచ్చాడు.

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

సంజూపై ప్రశంసలు..

సంజూ శాంసన్ చూపిన ఈ పెద్దమనసుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వైభవ్ అరంగేట్రం ఆలస్యమైనా.. హృదయాలను గెలుచుకోవడంలో టీమిండియా ముందంజలో ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన స్థానాన్ని భర్తీ చేస్తాడనే విషయం తెలిసి కూడా వైభవ్ సూర్యవంశీతో ప్రేమగా ఉండటం సంజూ శాంసన్ గొప్ప మనసుకు నిదర్శనమని కొనియాడుతున్నారు.

Story first published: Saturday, July 4, 2026, 18:20 [IST]
Other articles published on Jul 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+