IND vs ENG సంజూ శాంసన్.. ఇలా అయితే ఇంటికే గురూ!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో టీ20ల్లో ఓపెనర్‌గా అవకాశం అందుకున్న సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శనతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలి శతకం సాధించిన సంజూ.. సౌతాఫ్రికా పర్యటనలో మరో రెండు సెంచరీలు బాది ఓపెనర్‌గా తనకు తిరుగులేదని చాటి చెప్పాడు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ సంజూ చెలరేగుతాడని అంతా అనుకున్నారు. కానీ తొలి టీ20లో 26 పరుగులు చేసిన సంజూ శాంసన్.. తర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా 5, 3 సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒకే బౌలర్ చేతిలో ఒకే తరహా షాట్ ఆడి వెనుదిరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దూకుడైన ఆటతో బౌలర్లపై మెరుపు దాడి చేసే సంజూ శాంసన్‌ను ఇంగ్లండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బాల్స్‌తో బోల్తా కొట్టిస్తున్నారు.

జోఫ్రా ఆర్చర్ తొలి మూడు టీ20ల్లో షార్ట్ పిచ్ బాల్స్‌తోనే సంజూను పెవిలియన్ చేర్చాడు. పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఈ షార్ట్ పిచ్ బాల్స్‌ను వేగంగా వేస్తుండటంతో సంజూ అంచనా వేయడంలో విఫలమవుతున్నాడు. అటు డిఫెన్స్ చేయలేక.. షాట్‌గా కన్వర్ట్ చేయలేక మూల్యం చెల్లించుకుంటున్నాడు. షార్ట్ పిచ్ బాల్స్ సంజూకు బలహీనతగా మారిపోయింది.
ఈ సమస్యను అతను అధిగమించకపోతే.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. షార్ట్ పిచ్ బాల్స్ కాకుండా పేస్ బౌలర్లను కూడా సంజూ శాంసన్ సమర్థవంతంగా ఆడటం లేదు. వేగంగా బౌలింగ్ చేస్తున్న మార్క్ వుడ్, ఆర్చర్‌తో పాటు ఇతర ఇంగ్లీష్ పేసర్ల బౌలింగ్‌లో తడబడుతున్నాడు.
ఈ వైఫల్యం నుంచి బయటపడేందుకు సంజూ సిమెంట్ పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెట్స్‌లో ప్లాస్టిక్ బంతులను ఎదుర్కొంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమించకపోతే.. అతని కెరీర్ ఫినిష్ అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పుణె వేదికగా శుక్రవారం జరిగే నాలుగో టీ20 అతనికి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో రాణిస్తేనే అతనిపై ఒత్తిడి తగ్గనుంది. లేదంటే మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ షార్ట్ పిచ్ బాల్స్ బలహీనతను అధిగమించకపోతే.. ఐపీఎల్‌లో కూడా ప్రత్యర్థి బౌలర్లు ఇదే అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. గతంలో శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే సమస్యతో బాధపడి భారత జట్టుకు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications