Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన కైల్ మేయర్స్! (వీడియో)

ఫ్లోరిడా: టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. సెన్సేషనల్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి అమాంతం ఎగిరి అందుకున్న ఈ క్యాచ్‌ను చూసి కామెంటేటర్లతో పాటు ఆటగాళ్లు అవాక్కయ్యారు.

ఈ సంచలన క్యాచ్‌కు ఔటైన కైల్ మేయర్స్(17).. సంజూ కీపింగ్ స్కిల్స్ చూసి నోరెళ్లబెట్టాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సంజూ శాంసన్ కీపింగ్ సూపరో సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ధోనీ తర్వాత ఆ స్థాయిలో కీపింగ్ చేసేది సంజూ శాంసనేని కొనియాడుతున్నారు.

sanju samson

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని అర్ష్‌దీప్ సింగ్ షార్ట్ పిచ్ బాల్‌గా వేయగా.. మేయర్స్ కీపర్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సంజూ గాల్లోకి ఎగిరి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. అప్పటికే ఓ భారీ సిక్సర్‌తో పాటు రెండు బౌండరీలు బాదిన కైల్ మేయర్స్.. సంజూ సెన్సేషనల్ క్యాచ్‌తో నిరాశగా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన షై హోప్ ధాటిగా ఆడగా.. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్‌(18)ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో విండీస్ 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్.. డేంజరస్ నికోలస్ పూరన్(1)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ రోవ్‌మన్ పొవెల్(1) క్యాచ్ ఔట్ చేశాడు.

దాంతో వెస్టిండీస్ 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో షైహోప్‌తో పాటు షిమ్రాన్ హెట్‌మైర్ ఉన్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను విండీస్ గెలవగా.. మూడో టీ20ని భారత్ గెలుపొందింది. దాంతో ఈ నాలుగో టీ20 ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని విండీస్ భావిస్తుంటే.. సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

Story first published: Saturday, August 12, 2023, 20:50 [IST]
Other articles published on Aug 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+