Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోల్డ్ మెడల్ పళ్లెంలో పెట్టి ఇవ్వలేదు: సంజు శాంసన్ షాకింగ్ కామెంట్స్!

2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం భారత వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ మ్యాచ్ అనుభవాలను పంచుకున్నారు. ఈ గోల్డ్ మెడల్ విజయ తీరుపై స్పందిస్తూ.. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం తమకు అంత సులభంగా లేదా ఉచితంగా దక్కలేదని, దీని కోసం ఆటగాళ్లందరూ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై శ్రేయస్ అయ్యర్ బిగ్ స్టేట్‌మెంట్!

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై శ్రేయస్ అయ్యర్ బిగ్ స్టేట్‌మెంట్!

జపాన్‌లోని నగోయాలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరు గురించి సంజు శాంసన్ మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్‌లోని తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడంలో జట్టు అనుభవం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. భారత క్రికెట్ బోర్డు పూర్తి స్థాయి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన టీంను టోర్నీకి పంపడం ఎంతో సహాయపడిందని తెలిపారు. "మాది చాలా అనుభవం ఉన్న జట్టు. ప్రాక్టీస్ లేదా మ్యాచ్‌లు లేనప్పుడు కూడా మా శక్తిని ఎలా కాపాడుకోవాలో, జట్టును ఎలా ప్రేరేపించాలో, ఏకాగ్రతతో ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు. అనుభవజ్ఞులైన ప్రధాన టీ20 ఆటగాళ్లను బరిలోకి దించడం వల్ల కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించగలిగాం" అని సంజు శాంసన్ వివరించారు.

Sanju Samson Speaks After Defeating Pakistan Says Gold Medal Wasn t Given on a Platter Full Details

మ్యాచ్ వివరాల్గోకి వెళ్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 61), తిలక్ వర్మ(22 బంతుల్లో 51 నాటౌట్) తుఫాను హాఫ్ సెంచరీలతో పాక్ బౌలర్లను దెబ్బతీశారు. అనంతరం బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై 212 పరుగుల లక్ష్యంతో దిగిన పాకిస్తాన్ కూడా గట్టి పోటీ ఇచ్చి 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించడంతో మ్యాచ్ చివరివరకు ఉత్కంఠభరితంగా సాగింది.

అంతేలేకుండా క్రికెట్ మజా.. అక్టోబర్‌లో టీమిండియాకు బిజీ బిజీ షెడ్యూల్!

Also Read

అంతేలేకుండా క్రికెట్ మజా.. అక్టోబర్‌లో టీమిండియాకు బిజీ బిజీ షెడ్యూల్!

ఈ పోరు ఏకపక్షంగా సాగకపోవడపై సంజు శాంసన్ స్పందిస్తూ.. "మొదటి ఇన్నింగ్స్‌లో 200కి పైగా పరుగులు సాధించాక ప్రత్యర్థికి ఛేజింగ్ కష్డమవుతుందని భావించాం. కానీ వికెట్ బ్యాటింగ్ కు బాగుండటంతో పాకిస్తాన్ కూడా అద్భుతంగా ఆడింది. ప్రేక్షకులందరికీ ఓ గొప్ప ఫైనల్ మ్యాచ్ లభించింది. పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లు ఈ గోల్డ్ మెడల్ సులభంగా రాలేదు.. ఎంతో పోరాడి సాధించాం. అందుకే ఈ విజయం మాకు మరింత సంతృప్తిని ఇచ్చింది" అని సంజు శాంసన్ అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ పెద్ద బాధ్యత అని, స్టేడియంలోకి దిగాక ఒత్తిడికి లోను కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే తమ విజయాన్ని ఖాయం చేసిందని ఆయన ముగించారు.

Story first published: Sunday, October 4, 2026, 16:23 [IST]
Other articles published on Oct 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+