For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: ఒక్క సిక్స్‌తో రెండు రికార్డ్స్ సాధించిన సంజూ శాంసన్!

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డ్స్ సాధించాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గాయంతో జట్టుకు దూరమవడంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఓపెనింగ్ స్థానానికి తానే సరైనోడినని చాటి చెప్పాడు. ఈ మ్యాచ్ రెండో ఓవర్‌లో పికప్ షాట్‌తో లాంగాన్ దిశగా భారీ సిక్స్ బాదిన సంజూ శాంసన్.. రెండు అరుదైన రికార్డ్‌లను తన పేరిట లిఖించుకున్నాడు.

Sanju Samson Scripts History in 5th T20I vs South Africa Achieves Two Milestones With a Single Six

ఈ సిక్స్‌తో అంతర్జాతీయ టీ20‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. కేరళ తరఫున టీ20ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సంజూ కొట్టిన షాట్‌కు ఫిదా అయిన కామెంటేటర్.. 'సంజు శాంసన్ చాలా అద్భుతమైన ఆటగాడు. అతను చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ అతను ఆ షాట్ ఆడిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా సడెన్‌గా మైదానంలోకి దిగి ఆడినట్లుగా లేదు. బంతిని అతను టైమింగ్ చేసిన విధానం అంత సులువు కాదు.'అని కొనియాడాడు.

అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు చేసిన 14వ బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ(4231), విరాట్ కోహ్లీ(4188), సూర్యకుమార్ యాదవ్(2783), కేఎల్ రాహుల్(2265), హార్దిక్ పాండ్యా(1939), శిఖర్ ధావన్(1759), మహేంద్ర సింగ్ ధోనీ(1617), సురేశ్ రైనా(1605), రిషభ్ పంత్(1209), యువరాజ్ సింగ్(1177), తిలక్ వర్మ(1110), శ్రేయస్ అయ్యర్(1104), అభిషేక్ శర్మ(1081)లు సంజూ శాంసన్(1016) కంటే ముందున్నారు.

టీ20 ఫార్మాట్‌లో 8000 పరుగులు అందుకున్న 7వ భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్‌లు సంజూ శాంసన్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.

Story first published: Friday, December 19, 2025, 20:18 [IST]
Other articles published on Dec 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+