నిన్న మిస్సయ్యా.. కానీ త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరుస్తా: సంజూ శాంసన్

డబ్లిన్: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) దుమ్మురేపాడు. ఐర్లాండ్‌తో మంగళవారం జరిగిన రెండో టీ20లో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న అతను ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఐర్లాండ్ బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడిన శాంసన్.. కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 9 బౌండరీలు, 4 సిక్సర్లతో వీర విహారం చేశాడు.
ఇక సెంచరీ దిశగా సాగుతున్న సంజూ అనూహ్యంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 176 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. మంచి టచ్‌లో కనబడిన సంజూ సెంచరీ చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

సెంచరీ ఎందుకు చేయలేదంటే..?
ఇక ఈ మ్యాచ్ బ్రాడ్‌కాస్ట్ హోస్ట్ అయిన అజయ్ జడేజా సైతం సంజూ శాంసన్ సెంచరీ చేయకపోవడం పట్ల నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్‌తో మాట్లాడిన అతను సెంచరీ విషయాన్ని ప్రస్తావించాడు. సెంచరీ మిస్ అయినందుకు చాలా బాధగా ఉందని చెప్పాడు. దీనికి శాంసన్ బదులిస్తూ.. 'ఇది చాలా మంచి గేమ్. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో నేను, దీపక్ హుడా మంచి భాగస్వామ్యం అందించాం. నేను క్రీజులో కాస్త ఇబ్బందులు పడుతుంటే హుడా మాత్రం రెచ్చిపోయాడు.

చాలా సంతోషంగా ఉన్నా..
అతన్ని చూశాక నేను కూడా హుడాను అనుసరించాను. ఇక హుడా రెచ్చిపోతున్నప్పుడు నేను అతనికే స్ట్రైక్ ఇచ్చాను. ఇక నేను కూడా హిట్టింగ్ కు దిగినప్పుడు అతడు కూడా అలాగే చేశాడు. హుడా సెంచరీ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే మ్యాచుల్లో నేను కూడా సెంచరీ సాధిస్తాను. కానీ ఈ మ్యాచ్ లో నేను ఆడినదానికి మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను..'అని చెప్పుకొచ్చాడు.

రుతురాజ్ గాయపడటంతో..
దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటే సంజూ శాంసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతోనే అతను టీమిండియా సుస్థిర స్థానాన్ని అందుకోలేకపోయాడు. అతని కన్నా వెనుక వచ్చిన ఆటగాళ్లు టీమిండియాకు రెగ్యూలర్‌గా ఆడుతుంటే.. ఎంతో ప్రతిభ కలిగిన సంజూ మాత్రం ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగిన తాజా సిరీస్‌లోనూ అతనికి తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. అయితే రుతురాజ్ గాయపడటంతో అవకాశాన్ని అందుకున్న అతను తన సత్తా ఏంటో తెలియజేశాడు.


సిక్సర్ల జడివాన..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో కదంతొక్కగా.. సంజూ శాంసన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరి (రెండో వికెట్‌కు 176 పరుగుల) రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), ఆండీ బాల్‌బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరికి తోడు హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్‌రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications