Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీలోని ఆ తత్వమే నన్ను ప్రభావితం చేసింది: సంజు శాంసన్

Sanju Samson Says MS Dhonis calmness in tough situations has influenced him

తిరవనంతపురం: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మజహేంద్ర సింగ్ ధోనీపై యువ క్రికెటర్ సంజు శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండే ధోనీ తత్వం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఈ కేరళ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. మహీ ఆటలోని లక్షణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

'క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా ఉండే ధోనీలా నేను కూడా ఉండాలనుకుంటున్నా. బ్యాటింగ్ చేసే సమయంలో ప్రశాంతంగా ఉంటూ మరింత ఫోకస్‌గా ఆడాలనుకుంటున్నా'అని శాంసన్ చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరూ ట్రెండ్ సెట్ చేశారు..

ఆ ఇద్దరూ ట్రెండ్ సెట్ చేశారు..

ఇక క్రికెట్‌లో ధోనీ, ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ వికెట్ కీపర్ దృక్పథాన్నే మార్చేశారని సంజు తెలిపాడు. క్రికెట్‌లో ఒకప్పుడు వికెట్ కీపర్ పాత్ర చాలా పరిమితంగా ఉండేదని, లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి రావడం.. టెయిలెండర్లతో కలిసి కాసేపు ఇన్నింగ్స్‌ని కొనసాగించి.. కీపింగ్ చేస్తే సరిపోయేదన్నాడు. కానీ ధోనీ, గిల్ క్రిస్ట్ తమ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టాప్- మిడిలార్డర్‌లో సత్తాచాటి కీపర్లపై అప్పటి వరకూ ఉన్న దృక్పథాన్నే మార్చేశారని ఈ యువ వికెట్ కీపర్ కొనియాడాడు.

వారి వల్లే టాప్ బ్యాట్స్‌మెన్‌గా..

వారి వల్లే టాప్ బ్యాట్స్‌మెన్‌గా..

‘క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది వికెట్ కీపర్లు.. టాప్ బ్యాట్స్‌మెన్‌లుగా కొనసాగుతున్నారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా ఆడటం ద్వారా కీపర్లు టాప్ ఆర్డర్‌లోనూ సత్తా చాటగలరని నిరూపించాడు. ఇక ధోనీ మిడిలార్డర్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. వారి బాటలో ఇప్పుడు అందరు వికెట్ కీపర్లు టాప్ లేదా మిడిలార్డర్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌లుగా కొనసాగుతున్నారు. దాంతో కెప్టెన్‌కి ఒక బ్యాట్స్‌మెన్‌ని తగ్గించుకుని అదనపు బౌలర్‌ని తుది జట్టులోకి తీసుకునే వెసులబాటు కలుగుతోంది'అని సంజు చెప్పుకొచ్చాడు.

అదృష్టం లేని సంజు..

అదృష్టం లేని సంజు..

ఇక ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించే సంజు శాంసన్‌కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సిన అవకాశాలు రాలేదు. టీమ్ సెలెక్షన్ జరిగిన ప్రతీసారి సంజు వ్యవహారం ఓ హాట్ టాపిక్.. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా.. ఇంకా భారత జట్టు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ తరఫు 12 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. ఓ సెంచరీతో 342 పరుగులు చేశాడు. ఇక ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టీ20 మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకున్నా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

కీపింగ్ నైపుణ్యమే సరిపోదు..

కీపింగ్ నైపుణ్యమే సరిపోదు..

ఇక ఒకప్పటిలా కీపింగ్ నైపుణ్యం ఒక్కటే ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ల వెనుకాల రాణించడం కష్టం. అద్భుతమైన కీపింగ్‌తో అసాధారణంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంటేనే సక్సెస్ దక్కుతుంది.ఇటీవల కాలంలో అన్ని జట్లు కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో చాలా మంది ఆటగాళ్లు బ్యాటింగ్, కీపింగ్‌లో ఇరగదీస్తున్నారు.

ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్.. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ని ఆ జట్టు గెలవడంలో బ్యాట్స్‌మెన్‌గా క్రియాశీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్.. ఓపెనర్‌గా ఇప్పటికీ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. మహేంద్రసింగ్ ధోనీ.. గత ఏడాది జులై నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్నా.. ఇప్పటికీ అతనిని మించిన ఫినిషర్‌ లేడు. వెస్టిండీస్ వికెట్ కీపర్ షై హోప్.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్.. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.

Story first published: Friday, June 12, 2020, 20:51 [IST]
Other articles published on Jun 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+