Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక నా ఇష్టం వచ్చినట్లు ఆడుతా.. ఎవరి సలహాలు అక్కర్లేదు: సంజూ శాంసన్

ఓ క్రికెటర్‌గా తాను ఇప్పటికే ఎంతో సాధించానని, ఇక నుంచి తన ఆటను ఆస్వాదిస్తానని టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ అన్నాడు. తనకు ఎవరి సలహాలు, సూచనలు అక్కర్లేదని స్పష్టం చేశాడు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం ఆటను మాత్రమే ఆస్వాదించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

ఇదేం వివక్ష.. అభిషేక్‌కు ఒక న్యాయం! సంజూకు మరో న్యాయమా?: మాజీ సెలెక్టర్

ఇదేం వివక్ష.. అభిషేక్‌కు ఒక న్యాయం! సంజూకు మరో న్యాయమా?: మాజీ సెలెక్టర్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంజూ శాంసన్.. ఇటీవల జరిగిన సిరీస్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమవ్వడంతో సంజూ శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో తిరిగి అవకాశం అందుకున్నా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

Sanju Samson Says I ve decided to play on my terms Over quitting India selection rat race
Photo Credit: X (twitter)

ఇక అంతా నా ఇష్టం..

ఇంగ్లండ్ పర్యటన అనంతరం జియోహాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూను జియోహాట్‌స్టార్ ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ చేస్తోంది. తాజా ఎపిసోడ్‌లో తన భవిష్యత్తు ప్రణాళికల గురించి సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మన దేశంలో క్రికెటర్ల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందే ఈ పోటీకి దూరంగా ఉంది. ఆటను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నాకు నచ్చినట్లు ఆడుతాను.

అతని కోసమే సీఎస్‌కేలో చేరాను: సంజూ శాంసన్

అతని కోసమే సీఎస్‌కేలో చేరాను: సంజూ శాంసన్

ఆ దేవుడి దయవల్ల ఓ క్రికెటర్‌గా నేను ఇప్పటికే చాలా సాధించాను. నాకు ఇప్పుడు 31 ఏళ్లు. నేను ఇంకొన్నేళ్లు మాత్రమే ఆడగలను. కాబట్టి ఇక నుంచి నా బ్యాటింగ్ విషయంలో ఎవరి సలహాలు, సూచనలు అక్కర్లేదు. నేను ఎలా ఆడాలో నేనే నిర్ణయించుకుంటా. జట్టులో ఓ మంచి స్నేహితుడిగా ఉంటూ సహచర ఆటగాళ్లకు అండగా ఉంటా. కానీ నా శైలిలో మాత్రమే ఆడుతాను.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత నేను 2026 వరల్డ్ కప్ ఆడుతానని ఎప్పుడూ ఊహించలేదు. ప్రస్తుతం నేను 15 మంది సభ్యుల జట్టులో కూడా లేను. అలాంటప్పుడు ఇప్పుడే 2028 ప్రపంచకప్ గురించి నేను ఎందుకు ఆందోళన చెందాలి?'అని సంజూ శాంసన్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జింబాబ్వే పర్యటన నుంచి సంజూ శాంసన్‌కు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, July 28, 2026, 13:18 [IST]
Other articles published on Jul 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+