Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా ఓటమికి ఆ ఒక్క ఓవరే కారణమని చెప్పలేను: సంజూ శాంసన్

Sanju Samson says I cant point out one moment where we lost the game against RCB

ముంబై: రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఆ ఒక్క ఓవరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేతిలో తమ పరాజయానికి కారణమని చెప్పలేనని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. ఆర్‌సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచే మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్, షెబాజ్ అహ్మద్‌లు సూపర్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ ఓటమిని శాసించాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్ కార్తీక్ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 21 పరుగులు పిండుకొని మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చేసాడు. అయితే ఈ ఒక్క ఓవరే తమ ఓటమికి కారణమని చెప్పలేనని మ్యాచ్ అనంతరం పేరు ప్రస్తావించకుండా సంజూ పేర్కొన్నాడు.

జోస్, హెట్‌మైర్ సూపర్..

'మా ఓటమికి ఆ ఒక్క ఓవరే కారణమని చెప్పలేను. టాస్ ఓడి నెమ్మదైన వికెట్‌పై ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. పోరాడే లక్ష్యాన్ని ఉంచిన మా బ్యాటర్లను ఎంత మెచ్చుకున్నా తక్కువే. జోస్ బట్లర్, హెట్‌మైర్ మరోసా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా చివర్లో దుమ్మురేపారు. ఇక విపరీతమైన ముంచు ప్రభావం ఉన్న ఈ మైదానంలో మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లడం గొప్ప విషయం.

ఆ ఒక్కటి చేయాల్సింది...

విపరీతమైన డ్యూ ఉన్న బంతిని మార్చమని అంపైర్లను కోరలేదు. ఎందుకంటే మా బౌలర్ల పట్ల నేను అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా. దినేశ్ కార్తీక్ ఎంతో అనుభవం కలిగిన బ్యాట్స్‌మన్. అతను ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం సహజమే. అయితే మేం ఫీల్డ్ సెటప్ విషయంలో కొంత సమయం తీసుకోవాల్సింది. ఈ ఓటమితో ఎన్నో మెరుగైన విషయాలు నేర్చుకున్నాం. ఇది మాకు ఓ గుణ పాఠం'అని సంజూ శాంసన్ తెలిపాడు.

ఊపిరి పోసిన అశ్విన్...

చాహల్ దెబ్బకు 87/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆర్‌సీబీకి.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్ ఊపిరి పోసింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన కార్తీక్.. ఆ ఓవర్ మూడో బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీ తరలించాడు. అయితే అది నో బాల్ కావడంతో మరుసటి బంతి ఫ్రీ హిట్ కావడంతో స్వేచ్చగా సిక్స్ బాదాడు. దాంతో మూమెంటమ్ అందుకున్న అతను మరో రెండు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకున్నాడు. దాంతో మ్యాచ్ ఒక్కసారి ఆర్‌సీబీ వైపు మళ్లీంది.

కార్తీక్, షెబాజ్ సూపరో సూపర్..

ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్‌లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. హెట్‌మైర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 నాటౌట్), షెబాజ్ అహ్మద్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) విరోచితన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి తిరుగులేని విజయాన్నందించారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ రెండేసి వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Wednesday, April 6, 2022, 7:06 [IST]
Other articles published on Apr 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+