Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: ఆ ఇద్దరి వల్లే ఓడాం: సంజూ శాంసన్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్స్ జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ శాంసన్.. బౌలింగ్‌లో అదనంగా 10 పరుగులు ఇవ్వడంతో పాటు బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.

Sanju Samson says

'మేం సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌. ఓవర్‌కు 11-12 పరుగులే చేయాలి. సునాయసంగా చేధించాల్సిన లక్ష్యం. కానీ ఐపీఎల్‌లో ఇలా జరగడం సర్వ సాధారణం.

రెండు ఇన్నింగ్స్‌ల్లో మేం అద్భుతంగా రాణించాం. పరిస్థితులకు తగ్గట్లు మేం ఆడాం. ఈ వికెట్‌పై 220 పరుగుల లక్ష్యం అంటే.. 10 పరుగులు ఎక్కువ అన్నట్లే. మేం కొన్ని బౌండరీలు ఇవ్వాల్సింది కాదు. కానీ ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గర్క్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అయినా మేం పుంజుకున్నాం.

ఈ టోర్నీలో మేం మూడు మ్యాచ్‌లు ఓడాం. కానీ ఈ మూడింటిలోనూ చివరి వరకు పోరాడం. అందరికి గుర్తిండిపోయే ఆట ఆడాం.అయితే మేం మూమెంటమ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ కూడా అద్భుతంగా ఆడాడు.

గత 11 మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సందీప్ శర్మతో పాటు మా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో 2-3 భారీ సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. తదుపరి మ్యాచ్‌ గెలిచి టోర్నీలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తాం.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) మెరుపులు మెరిపించాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రసిక్ సలామ్‌ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Wednesday, May 8, 2024, 0:13 [IST]
Other articles published on May 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+