For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా జీవితంలో ద్రవిడ్ లాంటి వ్యక్తి ఉండటం ఎంతో అదృష్టం'

Sanju Samson says Blessed to have someone like Rahul Dravid in my life


తిరువనంతపురం
: రాహుల్‌ ద్రవిడ్‌ లాంటి కెప్టెన్‌, కోచ్‌ తన జీవితంలో ఉండటం అదృష్టమని కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ పేర్కొన్నాడు. 18 ఏళ్ల వయసులోనే దిగ్గజ ఆటగాడితో కలిసి ప్రయాణించడం విశేషం అని శాంసన్‌ అన్నాడు. క్రికెట్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ద్రవిడ్‌ సర్‌ నేతృత్వంలోనే నేర్చుకున్నానని, ఏ సందేహం వచ్చినా కాల్‌చేసి సలహాలు తీసుకుంటా అని శాంసన్‌ చెప్పాడు.
 ఆటపై విశేషమైన అవగాహన ఉంది:

ఆటపై విశేషమైన అవగాహన ఉంది:

తాజాగా సంజూ శాంసన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... 'ఒక బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌, కోచ్‌గా ద్రవిడ్‌ సర్‌ ఎన్నో విజయాలను, అదే సమయంలో వైఫల్యాలను కూడా చవిచూశారు. ఆటపై ఆయనకు విశేషమైన అవగాహన ఉంది. ఒక ఆటగాడితో ఎలా మెలగాలి, అతడిని ఎలా ఒప్పించాలనే విషయం ద్రవిడ్‌ సర్‌కు తెలుసు. అంతేకాదు ఆటగాడికి ఎలాంటి ఆలోచనా దృక్పథం ఉండాలి, ఒక టోర్నీకి ఎలా సన్నద్ధమవ్వాలి, గెలుపోటములను ఎలా స్వీకరించాలనే తదితర అంశాలు రాహుల్‌కు బాగా తెలుసు' అని పేర్కొన్నాడు.

ద్రవిడ్‌ సర్‌కు ఫోన్‌ చేస్తా:

ద్రవిడ్‌ సర్‌కు ఫోన్‌ చేస్తా:

'నా జీవితంలో 18 నుంచి 20 ఏళ్ల మధ్య రాజస్థాన్‌ రాయల్స్‌, ఇండియా-ఏ తరఫున ఆడేటప్పుడు క్రికెట్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను రాహుల్ ద్రవిడ్‌ సర్‌ నేతృత్వంలోనే నేర్చుకున్నా. నేనొక్కడినే కాకుండా భారత జట్టులో ఉండే ప్రతీ యువ క్రికెటర్‌ ఆయన పర్యవేక్షణలోనే ఎదిగారు. ఏ సందేహం ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాతో ఎప్పుడూ చెబుతుండేవారు. ఆట, టెక్నిక్ పరంగా నాకేమైనా అనుమానాలుంటే వెంటనే ద్రవిడ్‌ సర్‌కు ఫోన్‌ చేస్తా' అని సంజు శాంసన్‌ చెప్పాడు.

రాయల్స్‌ జట్టు రెండో ఇల్లు:

రాయల్స్‌ జట్టు రెండో ఇల్లు:

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తనకు రెండో ఇల్లు అని, ఎవరూ తనని ఎంపిక చేయనప్పుడు ఆ జట్టే నమ్మకం ఉంచిందని కేరళ కీపర్ స్పష్టం చేశాడు. '2013 ఐపీఎల్ ట్ర‌య‌ల్స్ జరుగుతున్నాయి. రాహుల్‌ సర్, జుబిన్‌ భారుచ (ప్రాంఛైజీ చీఫ్‌) రాజస్థాన్‌ రాయల్స్‌కు ట్రయల్స్‌ నిర్వహించారు. అప్పుడు నేను మంచి ఇన్నింగ్స్‌ ఆడాను. రెండో రోజు ముగిశాక.. రాహుల్‌ సర్ నా వద్దకొచ్చారు. నా జట్టులో ఆడతావా అని అడిగారు. నా య‌ద‌లో వేయి వీణ‌లు మోగిన‌ట్లు అనిపించింది. క‌ల నిజ‌మైన భావ‌న‌తో వెంట‌నే ఒప్పుకున్నా' అని సంజూ శాంసన్‌ తెలిపాడు. ద్రవిడ్‌ కెప్టెన్‌గా ఉండి ఎంతో ప్రోత్సహించారని, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో ఆడడం తనకు సంతోషంగా ఉంటుందన్నాడు.

కేవలం నాలుగు టీ20లు:

కేవలం నాలుగు టీ20లు:

టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి వారసుడిగా అందరూ అనుకున్న రిషబ్ పంత్‌ స్థాయికి తగ్గట్టు రాణించలేక జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకున్నాడు. పరిమిత ఓవర్లలో లోకేష్ రాహుల్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకాగా.. టెస్టులో వృద్దిమాన్ సహా నుంచి గట్టి పోటీ ఉంది. మరోవైపు ఐపీఎల్‌లో కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నా.. శాంసన్‌కు జట్టులో సరైన అవకాశాలు దక్కడం లేదు. శాంసన్ భారత్ తరపున కేవలం నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు. చివరిసారిగా గత మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు.

భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ ఎంతో అవసరం.. ఇప్పుడు ఆడకపోవడం సిగ్గుచేటుగా ఉంది: మాలిక్

Story first published: Wednesday, June 24, 2020, 11:31 [IST]
Other articles published on Jun 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+