Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐపై కామాతో సంజూ శాంసన్ నిరసన

Sanju Samsons simple tweet suggests game on despite puzzling omission

హైదరాబాద్ : టీమిండియా క్రికెటర్ సంజూశాంసన్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టాడు. అపార ప్రతిభ ఉన్నా.. సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ కేరళ బ్యాట్స్‌మన్ ఎవరిని నిందించాలో.. మరెవరినో తిట్టాలో అర్థంకాక లోలోపల కుమిలిపోతున్నాడు.
ఇప్పటికే పలుమార్లు తన అసహనాన్ని బాహటంగానే వ్యక్తం చేసిన సంజూ తాజాగా ఫ్రస్టేషన్‌తో చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అప్పుడెప్పుడో వరల్డ్‌కప్ సమయంలో హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు సెలెక్టర్లపై నిరస వ్యక్తం చేస్తూ త్రీడీ గ్లాస్ ట్వీట్ చేయగా.. ఇప్పుడు అదే తరహాలో శాంసన్ ట్వీట్ చేశాడు. జస్ట్ ,(కామా)తో ట్వీట్ చేశాడు. వాక్యం పూర్తి చేయకుండా మధ్యలో ఉంచే కామా..తో అదొక్కటే పోస్టు చేశాడు. దీనికి అర్థం పరమార్థం ఏంటో చెప్పుకుండా.. ఎవరికీ తోచింది వారు ఊహించుకునే అవకాశం ఇచ్చాడు. ఏ ఉద్దేశంతో పెట్టాడో కానీ.. టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఉన్నఆగ్రహంతోనే పెట్టి ఉంటాడనే విషయం ఆ ట్వీట్ కింద అభిమానులకు ఇచ్చిన రిప్లేలను చూస్తే అర్థం అవుతోంది.

11వేల లైక్స్.. 1.5 రీట్వీట్స్..
అసలు ఆ ట్వీట్ లో అర్థమేంటో తెలియకుండానే దానికి 11వేల లైక్‌లు, 1.5రీట్వీట్ లు వచ్చాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో 5టీ20ల సిరీస్ లో చోటు దక్కకపోవడంపై విసుగు చెంది ఇలా పెట్టాడా అనే అనుమానంతోనే ఫ్యాన్స్ ఈ ట్వీట్ కు రెస్పాండ్ అవుతున్నారు.
2015లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన శాంసన్.. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇటీవల శ్రీలంకతో జరిగిన చివరి టీ20 బరిలోకి దిగాడు. కానీ 6 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క మ్యాచ్ విఫలమవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసింది.

పంత్‌కు గాయం.. ఏం చేస్తారో
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గాయపడి కాంకషన్ తీసుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో వన్డేకు దూరమయ్యాడు. అతని గాయం తీవ్రతపై స్పష్టతలేకపోయినా.. ఒకవేళ అతను దూరమైతే న్యూజిలాండ్ సిరీస్‌కు శాంసన్‌ను పరిశీలించే అవకాశం ఉంది. ఆ చాన్స్ వచ్చినా పంత్ గైర్హాజరీతో ఇప్పటికే కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ రూపంలో తుది జట్టు స్థానం కోసం పోటీ ఎదురుకానుంది. శాంసన్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదని సెలక్టర్లను అభిమానులతో పాటు వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.

Story first published: Friday, January 17, 2020, 15:38 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+