
చెన్నై: టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోని టీమిండియా వెటరన్ ప్లేయర్ సంజూ శాంసన్ భారత్ ఏ జట్టు తరఫున కెప్టెన్‌గా సత్తా చాటాడు. న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగిన మూడు వన్డేల అనధికారిక సిరీస్‌ను భారత్ ఏ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత ఏ జట్టు 106 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ ఏను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ సంజూ శాంసన్( 68 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 54), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ( 62 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50), శార్దూల్ ఠాకూర్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ ఏ జట్టు 38.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజ్ భవ(4/11) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి. రిషి ధావన్, రాహుల్ చెరో వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, రాహుల్ త్రిపాఠి కలిసి మొదటి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం అందించారు.
35 బంతుల్లో 8 ఫోర్లతో 39 పరుగులు చేసిన అభిమన్యు ఈశ్వరన్‌ను మాథ్యూ ఫిషర్ ఔట్ చేయగా 25 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, జో వాకర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్( 68 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ( 62 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్(9) మాత్రం నిరాశపరిచాడు.
రిషీ ధావన్ (46 బంతుల్లో 4 ఫోర్లతో 34)ః రనౌట్ అయ్యాడు. రాజ్ భవ 4 పరుగులు చేయగా శార్దూల్ ఠాకూర్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51)మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 285 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ ఏ జట్టుకి మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కి 52 పరుగులు జోడించారు. చాడ్ బోవ్స్ 20 పరుగులు చేసి అవుట్ కాగా 7 బంతుల్లో 2 పరుగులు చేసిన రచిన్ రవీంద్రని రాహుల్ చాహార్ క్లీన్ బౌల్డ్ చేశాడు.