Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని కోసమే సీఎస్‌కేలో చేరాను: సంజూ శాంసన్

మహేంద్ర సింగ్ ధోనీ కోసమే తాను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టులోకి వెళ్లానని ఆ జట్టు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం తన జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని, కానీ తప్పలేదని తెలిపాడు.

ఐపీఎల్‌లో 10 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సంజూ శాంసన్.. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా సంజూ జట్టు మారాడు. అయితే సుదీర్ఘ కాలం రాజస్థాన్ రాయల్స్‌కు ఆడటంతో పాటు కెప్టెన్సీ చేసిన సంజూ శాంసన్ ఆ జట్టును వీడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Sanju Samson Reveals Why He Left Rajasthan Royals to Join Chennai Super Kings for IPL 2026
Photo Credit: X (twitter)

ఆ జట్టులో నా పనైపోయింది..

తాజాగా ఈ వ్యవహారంపై జియోస్టార్ 'సూపర్ స్టార్స్ షో'లో మాట్లాడిన సంజూ శాంసన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రాకతోనే తాను రాజస్థాన్ రాయల్స్ వీడాల్సి వచ్చిందని పరోక్షంగా వెల్లడించాడు. 'రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం నా జీవితంలోనే తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. నేను ఆ జట్టుకు ఐదేళ్లపాటు సారథిగా పనిచేశాను. కానీ ఏదో ఒక సమయంలో మన సమయం ముగిసిందనే విషయాన్ని మనం గ్రహించాలి.

ధోనీ కోసమే..

ఐపీఎల్ 2025 తర్వాతే జట్టును వీడాలని అనిపించింది. సంజూ శాంసన్ లేకుండా ఆడటానికి రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు సిద్దంగా ఉందని గ్రహించిన తర్వాతే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నా. రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన తర్వాత నాకు రెండు, మూడు జట్ల నుంచి పిలుపు వచ్చింది. కానీ నేను సీఎస్‌కేను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ధోనీ భాయ్ పట్ల నాకున్న అభిమానం. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ రుతురాజ్ గైక్వాడ్‌తో ఉన్న మంచి సంబంధమే. సీఎస్‌కే టీమ్ సంస్కృతి నా స్వభావానికి, ఆటకు సంపూర్ణంగా సరిపోతుందని నేను భావించాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్‌లో వైభవ్ సూర్యవంశీకి పెరిగిన ప్రాధాన్యతే సంజూ శాంసన్ నిష్క్రణకు కారణం కావచ్చనే అభిప్రాయం కలుగుతోంది. సంజూ శాంసన్ నిష్క్రణ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 772 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. మరోవైపు సీఎస్‌కే తరఫున ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 14 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాయంతో 477 పరుగులు చేశాడు.

Story first published: Friday, July 17, 2026, 10:07 [IST]
Other articles published on Jul 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+