బెంగళూరు: షిమ్రాన్ హెట్‌మైర్ విఫలమవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం మాట్లాడిన సంజూ శాంసన్.. టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలను వెనకేసుకొచ్చాడు.
లక్ష్యచేధనలో బిగ్ హిట్టర్ జాసన్ హోల్డర్‌ను కాకుండా అశ్విన్‌ను పంపించడం సరైన నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు. అశ్విన్ అనుభవమైన ఆటగాడు కావడంతోనే అతనిపై నమ్మకం ఉంచి ముందుగా బ్యాటింగ్ పంపించామని తెలిపాడు. హెట్‌మైర్‌కు ఈ రోజు కలిసిరాలేదని, అతను క్రీజులో ఉండి ఉంటే సునాయసంగా గెలిచే వాళ్లమని చెప్పాడు.

'ఈ మైదానంలో ఓవర్‌కు 10, 12, 13 పరుగులు చేసైనా లక్ష్యాన్ని చేధించవచ్చు. మూమెంటమ్ అందుకోవడమే ముఖ్యం. సాధారణంగా హెట్‌మైర్ ఇలాంటి మ్యాచ్‌ల్లో మా విజయ లాంఛనాన్ని పూర్తి చేస్తాడు. కానీ ఈ రోజు అతనికి కలిసి రాలేదు. ఒక్క షాట్ ఆడలేకపోయాడు. అదే మా ఓటమిని శాసించింది. పిచ్‌ను బట్టి మా నిర్ణయాలు మారాయి.
వికెట్ల పడగానే అశ్విన్‌ను పంపించాలని మేం నిర్ణయించుకున్నాం. అశ్విన్‌కు ఎంతో అనుభవం ఉంది. గత రెండు మూడు మ్యాచ్‌ల్లో తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడు. గుజరాత్ టైటాన్స్‌తో 6, 4 బాది మ్యాచ్‌ను మా వైపు మలుపుతిప్పాడు. ఈ మ్యాచ్‌లోనూ అలానే ఆడుతాడని ఆశించాం. దాంతోనే హోల్డర్‌ను కాదని అతన్ని బ్యాటింగ్‌కు పంపించాం. ఐపీఎల్‌లో విజయాలు, ఓటములు చిన్న తేడాతోనే ఉంటాయి.
చిన్న చిన్న విషయాలనే మనకు అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగాలి. మా తప్పిదాలపై మేం ఫోకస్ పెట్టి తదుపరి మ్యాచ్‌కు బలంగా బరిలోకి దిగాల్సి ఉంది.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), గ్లేన్ మ్యాక్స్‌వెల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసి ఓటమిపాలైంది. దేవదత్ పడిక్కల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లే తలో వికెట్ తీసారు.