
భారీ స్కోర్ చేయాలనే..
మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సంజూ.. ముందుగా బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. భారీ స్కోర్ చేస్తే ప్రత్యర్థి ఒత్తిడికి గురవుతుందని భావించామన్నాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఫైనల్ ఓడినా ఈ సీజన్ తమకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు.

ఓడినా.. గర్వంగా ఉంది..
‘ఈ సీజన్ మాకు ఎంతో ప్రత్యేకం. మేం అద్భుతమైన క్రికెట్‌తో అభిమానులను సంతోషపరిచాం. జట్టులోని యువ ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. మా జట్టు ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నా. టైటిల్ గెలవాలంటే కీలకమైన ఫాస్ట్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యమని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. అందుకే ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కామ్‌ల కోసం చాలా ఖర్చుపెట్టింది. క్వాలిటీ బౌలర్లతో టోర్నీ గెలవచ్చని మేం గట్టిగా నమ్మాం. వేలంలో బౌలర్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చాం.

జోస్ బాధ్యత అది...
20 ఓవర్ల పాటు ఆడటం జోస్ బట్లర్ బాధ్యత. నాది మాత్రం భిన్నం. ఇది మాకు అద్భుతమైన సీజన్. నేను చేసిన 30, 40, 20 పరుగులుకు జట్టు విజయానికి దోహదపడ్డాయి. ఈ ఓటమితో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్‌కు అభినందనలు'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం రాజస్థాన్ రాయల్స్ చేసిన అతిపెద్ద తప్పిదమని అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హార్దిక్ ఆల్‌రౌండ్ షో..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్' హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.


Click it and Unblock the Notifications

