గంభీర్ చెప్పిన ఆ ఒక్క మాటతో చెలరేగాను: సంజూ శాంసన్
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంభీర్ మద్దతుతోనే తాను టీ20 ఫార్మాట్‌లో సక్సెస్ సాధించానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో సంజూ శాంసన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కింది. అయితే అతను ఆరంభ మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా.. అతనిపై గంభీర్ నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకాన్ని సంజూ శాంసన్ నిలబెట్టుకున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌తో తన సత్తా చాటాడు.
తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజూ శాంసన్.. గంభీర్ మద్దతును గుర్తు చేసుకున్నాడు. శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. గంభీర్ చెప్పిన మాటలను నెమరు వేసుకున్నాడు.

'నేను డ్రెస్సింగ్ రూమ్‌లో దిగాలుగా కూర్చోవడాన్ని గంభీర్ గమనించాడు. నా దగ్గరకు వచ్చి ఏమైంది? అని అడిగాడు. నాకు వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాను. పరుగులు చేయలేకపోయానని అన్నాను. అయితే ఏమైంది? అని గంభీర్ ప్రశ్నించాడు. నువ్వు 21 సార్లు డకౌట్ అయినా తుది జట్టు నుంచి తప్పించను. స్వేచ్చగా బ్యాటింగ్ చేయాలని చెప్పాడు.
కోచ్, కెప్టెన్ ఇలా సపోర్ట్‌గా నిలబడితే ఏ ఆటగాడి ఆత్మవిశ్వాసమైనా రెట్టింపు అవుతుంది. వాళ్లు మనపై నమ్మకం ఉంచి సక్సెస్ కోరుకుంటారు. సూర్యకుమార్ యాదవ్ కూడా నాకు అండగా నిలిచాడు. దులీప్ ట్రోఫీ సందర్భంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ఆడిస్తానని సూర్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చాడు. అన్నట్లే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో అవకాశాలు ఇచ్చాడు. రెండు శతకాలతో అతని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. గంభీర్ మద్దతు ఆసియా కప్ 2025లోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications