Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: అంపైర్‌తో సంజూ శాంసన్ గొడవ.. క్రీజును వీడేందుకు ససేమిరా!(వీడియో)

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సహనం కోల్పోయాడు. అంపైర్ల నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి దిగిన అతను.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. క్రీజును వీడేందుకు నిరాకరించాడు. చివరకు అంపైర్లు సర్ది చెప్పడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

222 పరుగుల భారీ లక్ష్య చేధన‌లో రాజస్థాన్ రాయల్స్‌‌‌ కీలక బ్యాటర్లు చేతులెత్తేయగా.. సంజూ శాంసన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 28 బంతుల్లో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అయితే కీలక సమయంలో సంజూ శాంసన్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద షై హోప్ అద్భుతంగా అందుకున్నాడు.

Sanju Samson Refuses To Leave after Close Call By Umpire In RR vs DC IPL 2024 Match

ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని సంజూ శాంసన్ భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్‌పై షై హోప్ కళ్లు చెదిరే రీతిలో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఏ మాత్రం సమన్వయం కోల్పోకుండా బంతిని అందుకొని ఔరా అనిపించాడు. అయితే రీప్లేలో అతని బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌కు తాకినట్లు అనిపించింది.

దాంతో సంజూ శాంసన్ అంపైర్‌‌తో వాగ్వాదానికి దిగాడు. క్రీజును వీడేందుకు నిరాకరించాడు. చివరకు అంపైర్లు సర్దిచెప్పడంతో వెనక్కివెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ డగౌట్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రిప్లేలను మరోసారి పరిశీలిచింది. దాంతో మ్యాచ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) మెరుపులు మెరిపించాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రసిక్ సలామ్‌ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Tuesday, May 7, 2024, 23:54 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+