For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతను లేకపోవడమే మా కొంప ముంచింది: సంజూ శాంసన్

Sanju Samson hails Hardik Pandya’s All-Round Show After Gujarat Titans Beat Rajasthan Royals

ముంబై: స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ గైర్హాజరి తమ ఓటమికి ప్రధాన కారణమైందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రాజస్థాన్ రాయల్స్.. ఈ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమయ్యామని చెప్పాడు. ప్రత్యర్థి జట్టు తమ కంటే బాగా ఆడిందన్నాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో ట్రెంట్ బౌల్ట్ గాయపడటంతో అతను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని, అతని విలువ ఏంటో ఈ మ్యాచ్‌తో తెలుసొచ్చిందని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.

బౌల్ట్ లేకపోవడం..

బౌల్ట్ లేకపోవడం..

'గుజరాత్ 10-15 పరుగులు ఎక్కువగా చేసింది. ఈ రన్స్ రావడానికి తమ బౌలర్ల వైఫల్యమని చెప్పడం కంటే గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారని చెప్పాలి. హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వారి బ్యాటింగ్ ఆసాంతం అద్భుతంగా సాగింది. అయితే తమ చేతిలో వికెట్లు ఉంటే ఈ లక్ష్యాన్ని చేధించేవాళ్లమే. మేం మెరుగైన రన్‌రేట్‌తోనే ఆడాం. పవర్ ప్లేలో మా బ్యాటర్లు చెలరేగారు. కానీ మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. బౌల్ట్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని సేవలను ఈ మ్యాచ్‌లో మేం కోల్పోయాం.

హార్దిక్ అదరగొట్టాడు.

హార్దిక్ అదరగొట్టాడు.

అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నా. హార్దిక్ మాత్రం ఈ రోజు దుమ్మురేపాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో మెరిసాడు. కొన్నేళ్ల నుంచి ఈ లీగ్ ఆడుతున్న కాబట్టి.. ప్రతీ మ్యాచ్ ఎంత విలువైందో నాకు బాగా తెలుసు. తప్పిదాలను తెలుసుకొని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. తదుపరి మ్యాచ్‌కు పుంజుకుంటాం. గత సీజన్ వరకు నేను మూడో స్థానంలో ఆడాను. కానీ ఈ సారి జట్టు అవసరాలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఆ క్రమంలో నెంబర్ 4, 5 ప్లేస్‌ల్లో ఆడటానికైనా సిద్దం. అశ్విన్‌ను కూడా ఈ మ్యాచ్‌లో అలా ఆడించాం. పడిక్కల్ ఆరంభంలో మూడు మ్యాచ్‌లు మూడో స్థానంలో ఆడాడు. తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇదంతా టీమ్ కాంబినేషన్‌పై ఆధారపడి ఉంది.

భారీ లక్ష్యంతో..

భారీ లక్ష్యంతో..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 నాటౌట్‌) చివరి దాకా నిలబడి పరుగులు సాధించగా, అభినవ్‌ మనోహర్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించాడు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓడింది. జోస్‌ బట్లర్‌ (24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) చెలరేగాడు. ఫెర్గూసన్‌ (3/23) కీలక వికెట్లు తీశాడు.

Story first published: Friday, April 15, 2022, 8:35 [IST]
Other articles published on Apr 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+