Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: కుక్క తోక వంకరే.. ఈడు ఇక మారడు!

టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ నిరాశపర్చాడు. హోమ్ గ్రౌండ్‌లో సొంత అభిమానుల మధ్య చెలరేగుతాడని అంతా భావించగా.. సంజూ మాత్రం అదే తప్పిదాన్ని పునరావృతం చేశాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో సంజూ.. 6 బంతుల్లో ఫోర్‌తో 6 పరుగులే చేసాడు.

లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో సంజూ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ తన తప్పిదాన్ని పునరావృతం చేశాడు. మరోసారి ఫుట్‌వర్క్‌ లేకుండా షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఎదుర్కొన్న 6 బంతులను బ్యాక్‌ఫుట్‌లోనే ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఫుట్‌వర్క్‌పై ఫోకస్ పెట్టాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించినా సంజూ శాంసన్ పట్టించుకోలేదు.

Sanju Samson Brutally Trolled After Scoring 6 Runs in India vs New Zealand 5th T20I

సంజూ శాంసన్ వైఫల్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లూజ్ మోషన్స్ ఏమైనా అయ్యాయా? ఆత్రం ఆగకుండా ఔటై వచ్చావని మండిపడుతున్నారు. కుక్క తోక వంకరేనని, సంజూ ఇక మారడని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్విటర్‌కు ఎక్కువ.. టీమిండియాకు తక్కువని, జట్టులో అనవసరమని అభిప్రాయపడుతున్నారు. పీఆర్ స్టంట్స్‌తో సంజూ కెరీర్ కొనసాగిస్తున్నాడని మండిపడుతున్నారు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా ఐదుమ్యాచ్‌ల్లో 10, 6, 0, 24, 6లతో 46 పరుగులే చేసిన సంజూ శాంసన్.. టీ20 ప్రపంచకప్ 2026లో మొత్తం బెంచ్‌కే పరిమితం కానున్నాడు. 12వ ఆటగాడిగా వాటర్ బాటిల్స్ అందించనున్నాడు. తిలక్ వర్మ ఫిట్‌నెస్ సాధించి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అతను టీ20 ప్రపంచకప్ సమయానికి జట్టుతో కలవనున్నాడు. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. తిలక్ నెంబర్ 3లో ఆడనున్నాడు. సంజూ మాత్రం బ్యాకప్ ప్లేయర్‌గా బాటిళ్లు మోయనున్నాడు. ఎంతో ప్రతిభ కలిగిన సంజూ శాంసన్.. నిలకడలేమి ఆటతోనే స్టార్‌డమ్ అందుకోలేకపోయాడు. గత 12-13 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నా.. తుది జట్టులో చోటును సుస్థిరం చేసుకోలేకపోయాడు.

Story first published: Saturday, January 31, 2026, 20:03 [IST]
Other articles published on Jan 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+