IPL 2026: లక్నో విజయం.. కన్నీటి పర్యంతమైన సంజీవ్ గోయెంకా!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన లక్నో.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఆ విమర్శలు గుర్తు రావడంతోనే..
తమ కెప్టెన్ రిషభ్ పంత్ అజేయ హాఫ్ సెంచరీతో విజయలాంఛనం పూర్తి చేయడంతో ఆనంద భాష్పాలు కార్చాడు. రిషభ్ పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినప్పుడు వచ్చిన విమర్శలను గుర్తు చేసుకున్నాడో లేక.. గత మ్యాచ్ తర్వాత తనపై జరిగిన అసత్య ప్రచారం గుర్తుకొచ్చిందో తెలియదు కానీ ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. సంజీవ్ గోయెంకా కన్నీటి పర్యంతమైన క్షణాలకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్‌ను సంజీవ్ గోయెంకా హగ్ చేసుకొని మరి అభినందించాడు.

అసత్య ప్రచారం..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా సరదాగా మాట్లాడాడు. అయితే కొందరు ఈ వీడియోలోని కొన్ని క్షణాలను ఉద్దేశపూర్వకంగా కట్ చేసి.. రిషభ్ పంత్‌ను మందలించినట్లు ప్రచారం చేశారు. దాంతో సంజీవ్ గోయెంకాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో అతను ధోనీ, కేఎల్ రాహుల్ పట్ల ఇలానే కోప్పడిన సందర్భాలు ఉండటంతో తాజా ఘటన కూడా నిజమేనని అంతా అనుకున్నారు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి వీడియోను షేర్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది.
రిషభ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..
తాజా మ్యాచ్‌లో 157 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. రిషభ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వలేదనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్ష్ దూబే(2/18) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్ చెరో వికెట్ తీసారు.
అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), నితీష్ కుమార్ రెడ్డి(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేష్ రతి, మణిమరణ్ సిద్దార్థ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications