Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక బిగ్‌బాష్ లీగ్‌‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. సంజీవ్ గోయెంకా‌తో షురూ!

ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ లీగ్ బిగ్‌బాష్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగమవ్వనున్నాయి. బిగ్‌బాష్ లీగ్‌లోని 8 పురుష, మహిళా జట్ల వాటాలను విక్రయించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ 8 జట్ల ఓనర్‌షిప్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు వాటి సంబంధిత ప్రాంతీయ క్రికెట్ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. అయితే ఈ లీగ్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇన్నాళ్లు వెనుకాడింది.కానీ తాజాగా మనసు మార్చుకుంది. 8 జట్ల హక్కులను విక్రయించేందుకు ముందుకు వచ్చింది.

IND vs PAK: చేసింది తొక్కలో 55 రన్స్.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! (వీడియో)

IND vs PAK: చేసింది తొక్కలో 55 రన్స్.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! (వీడియో)

బిగ్‌బాష్ లీగ్‌లో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మాత్రమే కాకుండా.. మెల్‌బోర్న్ స్టార్స్, హోబర్ట్ హరికేన్స్, పెర్త్ స్కార్చర్స్ కూడా ప్రైవేట్ పెట్టుబడులను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి.

Sanjiv Goenka Eyes Big Bash League Entry Melbourne Renegades Reportedly in Target

సంజీవ్ గోయెంకా ఆసక్తి..

మెల్బోర్న్ జట్టును కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీ‌ఎస్‌జీ గ్రూప్ ప్రయత్నాలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టులోని 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు సంజీవ్ గోయెంకా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

సంజీవ్ గోయెంకా ఇప్పటికే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సౌతాఫ్రికా 20‌లో టర్బన్స్ సూపర్ జెయింట్స్, ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌ జట్లకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. దిహండ్రెడ్ 2026 లీగ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ విజేతగా నిలిచింది.

IND vs PAK: బ్రాడ్‌కాస్టర్‌కు భారీ బొక్క.. నట్టేట ముంచిన పాక్!

Also Read

IND vs PAK: బ్రాడ్‌కాస్టర్‌కు భారీ బొక్క.. నట్టేట ముంచిన పాక్!

క్రికెట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న గోయెంకా..

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు రూ.7090 కోట్ల భారీ ధరతో లక్నో జట్టును సంజీవ్ గోయెంకా కొనుగోలు చేశారు. తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు.. ఇటీవల ముగిసిన సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 10వ స్థానంలో నిలిచింది. రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు.

Story first published: Tuesday, September 8, 2026, 13:16 [IST]
Other articles published on Sep 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+