Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజీవ్ గోయెంకా ముచ్చట తీరింది!

ది హండ్రెడ్ పురుషుల టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌‌ను 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌ ఓడించింది. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం గమనార్హం. దాంతో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా టైటిల్ కరువు తీరింది.

ఫ్రాంచైజీలీగ్స్‌లో సూపర్ జెయింట్స్ గ్రూప్ గెలిచిన తొలి టైటిల్ కూడా ఇదే కావడం విశేషం. ఎన్నో ఏళ్లుగా టైటిల్ కోసం సంజీవ్ గోయెంకా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు జోస్ బట్లర్ నాయకత్వం.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ రూపంలో అతని కల నెరవేరింది.

Sanjeev Goenka Trophy Drought Ends as Manchester Super Giants Win The Hundred 2026 Title

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. బెన్ డకెట్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31),అనెయురిన్ డొనాల్డ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), లూయిస్ గ్రెగొరి(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ అహ్మద్(3/33) మూడు వికెట్లు తీయగా.. సోనీ బేకర్(2/34) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు. అనంతరం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 98 బంతుల్లో 5 వికెట్లకు 159 పరుగులు చేసి గెలుపొందింది. టీమ్ సీఫెర్ట్(38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 72) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లీస్ డు ప్లూయి(18 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మహమ్మద్ అమిర్(3/29) మూడు వికెట్లు తీయగా.. కాల్విన్ హరిసన్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన టీమ్ సీఫెర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లభించింది.

Story first published: Monday, August 17, 2026, 11:13 [IST]
Other articles published on Aug 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+