న్యూజిలాండ్ జట్టును టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించాడు. టీమిండియాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని సూచించాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు కుప్పకూలిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ తేలిపోయింది.
దాంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ చేసి 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70), సర్ఫరాజ్ ఖాన్(78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న విధానాన్ని చూసి సంజయ్ మంజ్రేకర్.. న్యూజిలాండ్‌ను హెచ్చరించాడు. కమ్‌బ్యాక్ చేయడంలో టీమిండియాకు మంచి నైపుణ్యం ఉందని, టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ఇలానే ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయం సాధించిందని ఎక్స్ వేదికగా గుర్తు చేశాడు.
ఒకవేళ నేను న్యూజిలాండ్ జట్టులో భాగమైతే.. ఇండియా బలమైన కమ్‌బ్యాక్‌కు కాస్త ఆందోళన చెందుతాను. ఈ భారత జట్టుకు కమ్ బ్యాక్ చేయడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కమ్‌బ్యాక్ చేసిన విధానం గుర్తుందా?'అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అద్భుతం చేసింది. హార్దిక్ పాండ్యా సంచలన బౌలింగ్.. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో విజయాన్నందుకొని టీ20 ప్రపంచకప్ 2024ను ముద్దాడింది. అదే తరహాలో బెంగళూరు టెస్ట్‌లోనూ టీమిండియా కమ్ బ్యాక్ చేస్తుందని సంజయ్ మంజ్రేకర్ ఎక్స్‌వేదికగా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం 125 పరుగుల వెనుకంజలో ఉన్న టీమిండియా.. శనివారం మొత్తం బ్యాటింగ్ చేస్తే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవు.
If I were NZ, I would be slightly worried with India’s strong reply. This Indian team has a great knack of coming back. Only recently SA needed 30 off 30 balls in the WT20 finals, remember that comeback? #INDvNZ
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) October 18, 2024