Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanjay Manjrekar:సీనియర్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి!

Sanjay Manjrekar wants Fresh Faces In India ODI Team In Place Of Struggling Veterans

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలోని టీమిండియా వైఫల్యంపై మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ సెలెక్షన్ లోపం వల్లనే భారత జట్టు విఫలమైందన్నాడు. ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు అనుభవం పేరిట అవకాశం కల్పించి టీమిండియా మూల్యం చెల్లించుకుందని విమర్శించాడు. ఇప్పటికైనా ఈ తప్పిదాలను సరిదిద్దుకోవాలని, సతమతమవుతున్న సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని సూచించాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో డిబేట్‌లో పాల్గొన్న మంజ్రేకర్.. టీమిండియా వైఫల్యాన్ని విశ్లేషించాడు.

 టీమ్ సెలెక్షన్ బాలేదు..

టీమ్ సెలెక్షన్ బాలేదు..

'సౌతాఫ్రికా పర్యటనకు సంబంధించి.. భారత జట్టు ఎంపికలోనే పెద్ద లోపముంది. చాలా మంది అనుభవం, ఫామ్‌లో లేని ఆటగాళ్లను తీసుకున్నారు. సీనియర్‌ ఆటగాళ్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో సత్తా చాటగలిగే నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. వన్డే ఫార్మాట్‌లో ఓపెనింగ్ చేయడం చాలా సులభం. ఓపెనర్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలు నమోదు చేసినా.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లపైనే జట్టు విజయం ఆధారపడి ఉంటుంది. సౌతాఫ్రికా పర్యటనలో అదే లోపించింది. మెరుగైన ఆరంభాలు లభించినా.. స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఓటమిపాలైంది' అని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

 దీపక్ చాహర్‌ను తీసుకోవాలి..

దీపక్ చాహర్‌ను తీసుకోవాలి..

'టీమిండియా బౌలింగ్‌ విభాగంలో కూడా మార్పులు చేయాల్సి ఉంది. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మునుపటి లయను అందుకోవడం దాదాపు కష్టమే అనిపిస్తోంది. అతని స్థానంలో దీపక్‌ చాహర్‌ను పూర్తి స్థాయి ఆటగాడిగా జట్టులోకి తీసుకోవచ్చు. మూడో వన్డేలో జన్నెమన్ మలన్‌ని ఔట్ చేసేందుకు దీపక్‌ వేసిన ఆ ఒక్క బంతి చాలు.. అతను ఎంత నాణ్యమైన బౌలరో చెప్పేందుకు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆ ఒక్క మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సహా 54 పరుగులు చేశాడు' అని మంజ్రేకర్‌ గుర్తు చేశాడు.

అశ్విన్ అవసరమా..?

అశ్విన్ అవసరమా..?

'సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ విషయంలో కూడా భారత్‌ ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంది. చాలా ఏళ్ల తర్వాత అనివార్య కారణాలతో అతనికి తుది జట్టులో స్థానం దక్కింది. రెండు మ్యాచులు ఆడినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. యువ ఆటగాడు ప్రసిద్ధ్‌ కృష్ణకు మరిన్ని అవకాశాలు కల్పించాలి. వన్డే ఫార్మాట్‌లో అశ్విన్ స్థానంలో మహమ్మద్‌ షమీని ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు' అని మంజ్రేకర్‌ సూచించాడు.

Story first published: Tuesday, January 25, 2022, 16:32 [IST]
Other articles published on Jan 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+