IPL 2022: భువీ కంటే ఆ పంజాబ్ పేసర్ ఎంతో నయం.. భారత జట్టులోకి తీసుకోవాల్సిందే!

న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ కుర్రాడిని మాజీ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్, సంజయ్ మంజ్రేకర్.. ఈ కుర్రాడి బౌలింగ్‌ను ప్రశంసించారు. అర్ష్‌దీప్ సింగ్‌ను టీమిండియాలోకి కూడా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అర్ష్‌దీప్‌తో చివర్లో మరిన్నీ ఓవర్లు వేయించాలని సెహ్వాగ్ సూచించగా.. భువనేశ్వర్ కుమార్ కంటే ఈ పంజాబ్ పేసర్ ఎంతో నయమని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. రోజు రోజుకి అర్ష్‌దీప్ మరింత మెరుగవుతున్నాడని పార్దీవ్ పటేల్ అన్నాడు.

డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇవ్వాలి..
'పంజాబ్ కింగ్స్ జట్టుకు రబాడ, అర్ష్‌దీప్ కీలకం. అయితే అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు ఎక్కువగా తీయకపోయినా ప్రత్యర్థి జట్టుకు తక్కువ పరుగులే సమర్పించుకుంటున్నాడు. అర్ష్‌దీప్ గుజరాత్, ముంబైతో జరిగిన మ్యాచుల్లో బాగా ఆడాడు. అతడికి డెత్ ఓవర్లలో బౌలింగ్ అప్పగించాలి. తదుపరి మ్యాచ్‌లో 18, 20 ఓవర్లలో అతడికి బౌలింగ్ అవకాశం ఇవ్వాలి" అని సెహ్వాగ్ సూచించాడు. ఇక భారత్ జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ అవసరం ఉందని, ఆ స్థానాన్ని అర్ష్‌దీప్‌తో భర్తీ చేయాలని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.

భారత జట్టుకు సరైనోడు..
'అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పేసర్లకు కష్టమైన వికెట్‌పై కూడా చెలరేగుతున్నాడు. పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తున్నాడు. కొత్త బంతితోనూ సత్తా చాటుతున్నాడు. అతని బౌలింగ్‌లో వైవిధ్యంతో పాటు టెంపర్‌మెంట్ ఉంది. తీవ్ర ఒత్తిడిలో కూడా తనలో ఉన్న టాలెంట్‌ను బయటపెడుతున్నాడు. అందుకే శ్రీలంకతో జరగబోయే సిరీస్‌కు అతన్ని భారత్ క్రికెట్ జట్టులోకి తీసుకోవాలని చెబుతున్నా. రోజు రోజుకి అతని ప్రదర్శన మెరగవుతోంది. భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ అవసరం ఉంది. ఆ స్థానానికి అతను సరైనవాడు.'అని పార్థివ్ పటేల్ అన్నాడు.

భువీ కంటే బెటర్..
భువనేశ్వర్‌కు బదులు అర్ష్‌దీప్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. 'ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా అతను వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. సెటిల్ అయిన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా అతని బౌలింగ్ ఆడలేక సింగిల్ తీసుకున్నాడు. గత మూడేళ్లుగా అర్ష్‌దీప్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. భువీ కంటే ఎంతో నయం. టీమిండియా టాప్-5 బౌలర్లలో అర్ష్‌దీప్ ఒకడు. మలింగా, బుమ్రా మాదిరి అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తున్నాడు'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

రెండు మ్యాచ్‌ల్లో..
ముంబై ఇన్నింగ్స్‌లో అర్ష్‌దీప్ 18వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కీలక సమయంలో.. ఓ ఓవర్లో కూడా కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. 2019 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు రెగ్యులర్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతంలోనూ ఎన్నో మంచి ప్రదర్శనలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications