For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ నోరు జారిన సంజయ్ మంజ్రేకర్.. ఉత్తరాది ఆటగాళ్లంటూ విద్వేశపూరిత వ్యాఖ్యలు..!

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నోరు జారాడు. ఉత్తరాది క్రికెటర్ల గురించి తనకు తెలియదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో అతనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేవించి 'బిట్స్ అండ్ పీసెస్'అనే వ్యాఖ్యలు చేసి మంజ్రేకర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

సహచర కామెంటేర్ హర్షా భోగ్లేతో కూడా అనుచితంగా ప్రవర్తించాడు. తరుచూ సంజయ్ మంజ్రేకర్ నోరు జారుతుండటంతో బీసీసీఐ కొంతకాలం అతనిపై చర్యలు తీసుకుంది. ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించింది. ఆ తర్వాత మళ్లీ కామెంట్రీ ప్యానెల్‌కు వచ్చిన సంజయ్ మంజ్రేకర్.. మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Sanjay Manjrekar Trolled For Racist Comment On-Air During Women s T20 World Cup 2024

ఉత్తరాది ఆటగాళ్లంటూ...
శుక్రవారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు సంజయ్ మంజ్రేకర్ కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఈ మ్యాచ్ సందర్భంగా సహచర కామెంటేటర్‌తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత మహిళా జట్టు ఫీల్డింగ్ కోచ్ మునిష్ బాలి గురించి మాట్లాడుతూ.. 'ఉత్తరాది క్రికెటర్ల' గురించి తనకు పెద్దగా అవగాహన లేదన్నాడు.

'నన్ను మీరు క్షమించాలి. బాలిని నేను గుర్తించలేకపోయా. ఉత్తరాది నుంచి వచ్చే క్రికెటర్లపై నాకు పెద్దగా అవగాహన లేదు.'అని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు.

జాతీయ జట్టు కోచ్ తెలియదా..?
బాలి అండర్ -19 పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించి జాతీయ స్థాయికి ఎదిగాడని, అతను తెలియకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ముంబై ఆధిపత్యమే కొనసాగాలని భావిస్తున్నారా? అని విమర్శలు గుప్పించారు.

ఆటగాళ్లు, భారత జట్ల కోచ్‌ల గురించి తెలియని వారిని బీసీసీఐ కామెంటేటర్‌గా ఎందుకు కొనసాగిస్తుందని విమర్శించారు. కనీసం భారత జట్టు కోచ్‌ల గురించి తెలియకుండా కామెంట్రీ ఎలా చేస్తారని మండిపడుతున్నారు.

జడేజాను సైతం..
వన్డే ప్రపంచకప్ 2019 సెమీస్ సందర్భంగా రవీంద్ర జడేజాను ఉద్దేశించి 'బిట్స్ అండ్ పీసెస్' ఆటగాడని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యనించాడు. ఈ వ్యాఖ్యలపై జడేజా ఘాటుగా బదులిచ్చాడు. అయితే తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, ఇంగ్లీష్ భాష సమస్య వల్లే ఇలా జరిగిందని మంజ్రేకర్ వివరణ ఇచ్చుకున్నాడు.

జడేజాను తక్కువ చేసి మాట్లాడనని అపార్థం చేసుకున్నారని, కానీ తన ఉద్దేశం అది కాదని స్పష్టం చేశాడు. నాన్ స్పెషలిస్ట్ అనే పదం వాడితే గొడవే ఉండేది కాదని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, October 5, 2024, 18:34 [IST]
Other articles published on Oct 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+