Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanjay Manjrekar: ఆర్‌సీబీ కెప్టెన్ రేసులో ఆ ముగ్గురు! ఆ ముంబై ఆల్‌రౌండర్ అయితే బెటర్!

Sanjay Manjrekar Suggests 3 Names to Replace Virat Kohli as RCB Captain in IPL 2021

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆర్‌‌సీబీ తదుపరి కెప్టెన్ ఎవరా? అనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ప్రధానంగా ఏబీ డివిలియర్స్‌ పేరు వినిపిస్తున్నా.. వయసు రీత్యా అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడినా అతను సరైన ఎంపిక కాదని క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆర్‌సీబీ కెప్టెన్సీ చేపెట్టేందుకు సరైన ఆటగాళ్లు వీరేనంటూ మంజ్రేకర్ ఓ ముగ్గురు ఆటగాళ్ల పేర్లను సూచించాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో‌తో మాట్లాడిన మంజ్రేకర్.. ఆర్‌సీబీ కెప్టెన్సీ సారథిగా ఇతర జట్ల ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల చేపట్టేందుకు సరైనవాళ్లని చెప్పుకొచ్చాడు.

'ఒక వేళ ఏబీ డివిలియర్స్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఎంపిక చేస్తే ఎంతకాలం కొనసాగుతాడు. నా ఉద్దేశం ప్రకారం కనీసం మూడేళ్లు ఒక ఆటగాడు కెప్టెన్‌గా కొనసాగాలి. కీరన్ పొలార్డ్‌ (34) వయసు కాస్త ఎక్కువే అయినా మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆటగాడు. ఎప్పుడూ అత్యుత్తమ ఆటగాళ్లను తయారుచేసిన జట్టు నుంచే నాయకుడిని ఎంపిక చేయాలి. ముంబై ఇప్పటికే ఐపీఎల్‌లో నంబర్‌ వన్ జట్టుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విండీస్‌ క్రికెటర్‌‌ బెంగళూరుకు సరైన ఎంపిక. అదే జట్టులోని సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఆ బాధ్యతలు చేపట్టగలడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ను ఒకసారి ఛాంపియన్‌గా నిలబెట్టిన తర్వాత ప్రతిసారీ ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన డేవిడ్ వార్నర్‌ కూడా కోహ్లీ టీమ్‌కు కెప్టెన్‌గా సరిపోతాడు'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

ఇక ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్లంతా అందుబాటులోకి రానున్నారు. అయితే రిటైన్ పాలసీ ప్రకారం ఓ జట్టు నలుగురుని మాత్రమే రిటైన్ చేసుకునే చాన్సుంది. అందులో ముగ్గురు స్వదేశీ, ఒకరు విదేశీ లేదా ఇద్దరు స్వదేశీ, మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ పొలార్డ్‌ను వదులుకోవడం కష్టం. కెప్టెన్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా‌లను రిటైన్ చేసుకునే చాన్సుంది. దాంతో సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డికాక్ కోసం ఆర్‌సీబీ ప్రయత్నించవచ్చు.

Story first published: Sunday, September 26, 2021, 14:04 [IST]
Other articles published on Sep 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+