Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించాల్సింది: సంజయ్ మంజ్రేకర్

మైదానంలో గొడవకు దిగిన టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందని మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఓ మ్యాచ్ ఆడినవ్వకుండా పక్కన పెట్టి అతనికి గుణపాఠం చెప్పాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో ఉత్కంఠగా జరిగిన గత మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్ అనంతరం ఎగతాళి చేసిన శ్రీలంక ఆటగాడిని వైభవ్ సూర్యవంశీ నెట్టేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Sanjay Manjrekar Slams Vaibhav Sooryavanshi Calls for Youngster s Ouster After On-Field Clash

ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన సంజయ్ మంజ్రేకర్.. అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'నేను గనుక భారత్-ఏ జట్టుకు కోచ్ లేదా మేనజర్‌గా ఉండి ఉంటే.. అఫ్గానిస్థాన్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ నుంచి వైభవ్ సూర్యవంశీని కచ్చితంగా తొలగించేవాడిని. ఎంత రెచ్చగొట్టినప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మైదానంలో భౌతికంగా గొడవపడటం ఆమోదయోగ్యం కాదు. 'అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

IND vs AFG: సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా!

IND vs AFG: సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా!

శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబకే హద్దులు ధాటాడని, శ్రీలంక విజయానంతరం ఇంటికి వెళ్లు.. ఇది ఐపీఎల్ కాదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని వార్తలు వచ్చినా.. వైభవ్ సూర్యవంశీ తీరును సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. అతను క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ టీమిండియా పిలుపు కూడా అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా టీమిండియాకు ఎంపికైన అతి పిన్నవయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

అయితే భారత్-ఏ తరఫున నాలుగు మ్యాచ్‌ల్లో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. 14, 44, 21, 38 పరుగులే చేశాడు. అఫ్గానిస్థాన్-ఏతో మ్యాచ్‌లో రెండు లైఫ్స్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ విఫలమైనా భారత్-ఏ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.

మళ్లీ వివాదంలో వైభవ్ సూర్యవంశీ.. అంపైరింగ్‌పై దుమారం!

మళ్లీ వివాదంలో వైభవ్ సూర్యవంశీ.. అంపైరింగ్‌పై దుమారం!
Story first published: Wednesday, June 17, 2026, 19:22 [IST]
Other articles published on Jun 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+