IPL 2022: అదో బేకార్ నిర్ణయం.. అశ్విన్‌ను ఆ స్థానంలో ఆడించడం అవసరమా?


ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ చేసిన ఓ ప్రయోగం బెడిసికొట్టింది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ సంజయ్ మంజ్రేకర్.. ఆర్‌ఆర్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్స స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. 8 బంతులు ఎదుర్కొన్న అశ్విన్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఫస్ట్ డౌన్‌లో అశ్విన్ బ్యాటింగ్‌కు పంపడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు.

సంజూ వచ్చి ఉంటే..
‘సంజూ శాంసన్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు సిద్దంగా ఉండగా... అశ్విన్‌ను పంపాల్సిన అవసరం ఏముంది. బట్లర్ దూకుడుగా ఆడుతున్నప్పడు.. అతని జోడీగా మూడో స్థానంలో సంజూ శాంసన్ వచ్చి ఉంటే బాగుండేది. అశ్విన్‌ను ఆ స్థానంలో హిట్టింగ్ కోసం పంపారని నేను అనుకుంటున్నా. కానీ అది అవసరం లేదు. లక్ష్యం 215 పరుగులు పైగా ఉంటే ఇటువంటి ప్రయోగాలు చేసినా పర్వాలేదు.

అశ్విన్ అవసరమా?
కాగా ఒకరిని బ్యాటింగ్ పంపేటప్పుడు అతనికి హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉందా? లేదా? అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలి. బట్లర్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అటువంటి సమయంలో రాజస్థాన్ ఇటువంటి నిర్ణయం ఎందకు తీసుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఇది ఒక చెత్త నిర్ణయం. ఈ ప్రయోగం జట్టు ఓటమికి కారణమైంది" అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

బట్లర్ చెలరేగినా..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 నాటౌట్) చివరి దాకా నిలబడి పరుగులు సాధించగా, అభినవ్ మనోహర్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓడింది. జోస్ బట్లర్ (24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) చెలరేగాడు. ఫెర్గూసన్ (3/23) కీలక వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications