ఆ ఇద్దరి కోసం యశస్వి జైస్వాల్‌ను తప్పిస్తారా? సంజయ్ మంజ్రేకర్ ఫైర్!
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టు నుంచి తప్పించడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు. కేవలం సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకోవద్దంటూ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు.
ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో మెరిసాడు. ఇప్పటివరకు ఆడిన 6 వన్డే మ్యాచ్‌ల్లోనే రెండు శతకాలు బాదిన ఘనత ఈ యువ బ్యాటర్‌కు ఉంది. గతంలో సౌతాఫ్రికాపై కూడా అతను 116 పరుగులతో రాణించాడు. అయితే, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడంతో మంచి ఫామ్‌లో ఉన్న జైస్వాల్‌పై వేటు వేయడం అత్యంత దురదృష్టకరమని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..
యశస్వి జైస్వాల్‌కు వచ్చిన అవకాశాలను అతను చక్కగా ఉపయోగించుకున్నాడని, అలాంటి ఆటగాడిని పక్కనబెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఎంపికను కూడా ఆయన ప్రశ్నించారు. ఒకవేళ 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ ఉంటేనే అతడిని జట్టులో కొనసాగించాలని, లేదంటే ఆ స్థానాన్ని మరో ప్రతిభావంతుడైన యువకుడికి ఇవ్వాలని సెలెక్షన్ కమిటీకి సూచించాడు.
సీనియర్ ఆటగాళ్ల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం సుదీర్ఘ కాలంగా భారత క్రికెట్‌లో ఉన్న పెద్ద లోపమని మంజ్రేకర్ విమర్శించాడు. జట్టు ఎంపిక అనేది ఎప్పుడూ కోహ్లీ, రోహిత్ లేదా జస్ప్రీత్ బూమ్రా ప్రయోజనాల కోసమే కాకుండా, భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరగాలని స్పష్టం చేశాడు. ఆటగాళ్ల వ్యక్తిగత ముద్ర కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని హితవు పలికారు. భారత్, ఇంగ్లండ్ మధ్య జూలై 14 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

