ఆ ఘటన తర్వాత యువరాజ్‌ను గౌరవించడం ప్రారంభించా.. అభిమానిగా మారిపోయా: మంజ్రేకర్

ముంబై: యువరాజ్ సింగ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్‌లో ఓ సంచలనం. యువీ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆటతో ఎందరో అభిమానులు యువీ సంపాదించుకున్నాడు. ఇందులో మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా ఉన్నాడు. యువీని మొదటలో విమర్శించిన మంజ్రేకర్.. 2012లో జరిగిన ఓ ఘటన తర్వాత అతడికి పెద్ద అభిమాని అయ్యాడట. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

జట్టులో చోటివ్వడం నాకిష్టం లేదు
తాజాగా సంజయ్ మంజ్రేకర్ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ... '2012 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌కి తుది జట్టులో చోటివ్వడం నాకిష్టం లేదు. అప్పటికే క్యాన్సర్ నుంచి కోలుకున్న యువరాజ్.. పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. ఈ కారణంతోనే పొట్టి ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం సరికాదని అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశా. అయితే భావోద్వేగ పరిస్థితుల్లో యువీని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రపంచకప్‌లో యువీ ఒక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు' అని తెలిపాడు.

యువీని చూసి కాస్త ఆందోళన చెందా
'ఆ మ్యాచ్ అనంతరం నేను వ్యాఖ్యాతగా.. ట్రోఫీల బహూకరణ జరుగుతోంది. ఆ సమయంలో యువరాజ్ సింగ్‌ని చూసి కాస్త ఆందోళన చెందా. అంతకుముందు నేను చేసిన వ్యాఖ్యల పట్ల అతడు అసంతృప్తితో ఉన్నాడనుకున్నా. అతడిని 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కోసం పిలిచినప్పుడు.. నన్ను చూస్తూ నవ్వుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యం వేసింది. అప్పుడు తనతో.. నువ్వు ఈ జట్టులో ఉండడం కొంత మందికి ఇష్టం లేదు అని చెప్పాను' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.

యువీ అభిమానిగా మారా
'నా మాటలకు యువరాజ్ స్పందించాడు. అవును సర్.. కొంత మంది ఇలా అన్నారని నేను కూడా విన్నానన్నాడు. ఆ తర్వాత నన్ను చూసి నవ్వాడు. ఆ నవ్వును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా విమర్శల్ని కూడా యువీ చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఆ నవ్వులో ఏ మాత్రం ఎగతాళి లేదు. దాన్ని క్రీడాస్ఫూర్తితో తీసుకున్నాడు. అప్పుడు ఇంటర్వ్యూలో నాతో బాగా మాట్లాడాడు. ఆ తర్వాతే నేను యువరాజ్‌ను గౌరవించడం ప్రారంభించా. ఆపై అతడికి అభిమానిగా మారా' అని మంజ్రేకర్ చెప్పుకోచ్చాడు.

2019లో క్రికెట్‌కు వీడ్కోలు
2019, జులై 10 యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ సహా మరే టోర్నీలేవీ ఆడనని వెల్లడించాడు. యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
India vs England: 'కర్ణాటక నుంచి మరో ఆటగాడు జాతీయ జట్టులోకి వస్తే.. అది కచ్చితంగా అతడే అనుకున్నా'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications