For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: 'కర్ణాటక నుంచి మరో ఆటగాడు జాతీయ జట్టులోకి వస్తే.. అది కచ్చితంగా అతడే అనుకున్నా'

KL Rahul says I was not surprised by Prasidh Krishnas bowling in 1st ODI

పూణే: కర్ణాటకకు చెందిన యువ పేసర్ ప్రసిద్ధ్‌ కృష్ణ ప్రదర్శన తనకెలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని టీమిండియా వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. తన రాష్ట్రానికే చెందిన ప్రసిద్ధ్‌ ప్రతిభ గురించి తనకు బాగా తెలుసని, కర్ణాటక నుంచి మరో ఆటగాడు జాతీయ జట్టులోకి వస్తే అది కచ్చితంగా అతడే అనుకున్నానని తెలిపాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ధ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 8.1 ఓవర్లు బౌలింగ్‌ చేసి 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో వన్డేలో కూడా చోటు దక్కించుకున్నాడు.

కచ్చితంగా ప్రసిద్దే అనుకున్నా

కచ్చితంగా ప్రసిద్దే అనుకున్నా

రెండో వన్డేకు ముందు కేఎల్‌ రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ... 'తన అరంగేట్ర మ్యాచ్‌లో ప్రసిద్ధ్‌ ప్రదర్శన నాకెలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కర్ణాటక నుంచి మరో ఆటగాడు జాతీయ జట్టులోకి వస్తే.. అది కచ్చితంగా ప్రసిద్దే అనే నమ్మకంతో ఉండేవాణ్ని. మేం ఒకటే వయసు విభాగం కాదు. కానీ జూనియర్‌ క్రికెట్లో, నెట్స్‌లో అతని బౌలింగ్‌ చూశా. తన ఆటతో అతను మన కళ్లని తిప్పుకోగలడు. పొడుగ్గా ఉన్న అతను వేగంగా బంతులేస్తాడు. బౌన్స్‌ రాబడతాడు. అతనెంతో ధైర్యవంతుడైన కుర్రాడు, దూకుడు ప్రదర్శిస్తాడు. అతనితో గత కొన్ని సీజన్లుగా దేశవాళీల్లో ఆడిన అనుభవంతో ఇలా చెపుతున్నా' అని అన్నాడు.

ఐపీఎల్ వల్లే

ఐపీఎల్ వల్లే

'గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌కు ప్రసిద్ధ్‌ కృష్ణ మాటలు విసిరేందుకు ప్రయత్నించడాన్ని చూశాం. తన ఆరంభ ఓవర్లలో పరుగులు ఇచ్చినప్పటికీ తిరిగి పుంజుకున్న అతను కీలక వికెట్లు పడగొట్టిన విధానం ఆకట్టుకుంది. ఐపీఎల్, దేశవాళీ అనుభవంతో అరంగేట్ర మ్యాచ్‌ల్లోనే కుర్రాళ్లు అదరగొడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్‌ కృష్ణలలే అందుకు నిదర్శనం' అని కేఎల్‌ రాహుల్‌ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో సూర్య, ఇషాన్, కృనాల్, ప్రసిద్ధ్‌ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఆడుతుంటేనే మంచి ఫామ్‌లో ఉంటాం

ఆడుతుంటేనే మంచి ఫామ్‌లో ఉంటాం

మూడు నెలలుగా మ్యాచ్‌లు ఆడకపోవడంతో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించలేకపోయానని కేఎల్ రాహుల్ చెప్పాడు. తొలి వన్డేలో అజేయ అర్ధ శతకంతో రాహుల్‌ తిరిగి ఫామ్‌ అందుకున్నాడు. 'ఓ బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉండి, మ్యాచ్‌లు ఆడుతుంటేనే మంచి ఫామ్‌లో ఉంటాం. గత మూడు నెలలుగా అనుకున్నన్ని మ్యాచ్‌లు ఆడకపోవడంతో టీ20ల్లో పరుగులు చేయలేకపోయా. మంచి సన్నాహకం ఉండాలి. అది శిక్షణ కావొచ్చు లేదా నెట్స్‌లో ప్రాక్టీస్‌ కావొచ్చు' అని రాహుల్‌ తెలిపాడు. రాహుల్ వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో 1,0, 0, 14 పరుగులు చేశాడు.

పోటీని తట్టుకోవాల్సిందే

పోటీని తట్టుకోవాల్సిందే

'జట్టులో ఉండాలంటే తీవ్రమైన పోటీని తట్టుకోవాల్సిందే. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లు జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. నా సన్నద్ధతలో ఏదైనా లోపముందా అని నన్ను నేను ప్రశ్నించుకుని తిరిగి వన్డే సిరీస్‌కు మెరుగ్గా సిద్ధమయ్యా. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాగా ఆడకపోతే నిరాశపడతాం. బాగా ఆడి దేశానికి విజయాలు అందిస్తూనే ఉండాలి. అయితే ప్రతిసారీ ఆ పని చేయలేకపోవచ్చని మాత్రం అంగీకరించాలి. గత రెండున్నరేళ్లుగా నాకు అప్పజెప్పిన ప్రతి పాత్రను పోషించాను' అని రాహుల్‌ పేర్కొన్నాడు.

India vs England: అతడు ప్రసిద్ధ్‌ కృష్ణ కాదు.. కరిష్మా: షోయబ్‌ అక్తర్‌

Story first published: Friday, March 26, 2021, 14:34 [IST]
Other articles published on Mar 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+