శ్రీలంక తప్పులేదు.. అతని అలసత్వమే రనౌట్‌కు కారణం: సంజయ్ మంజ్రేకర్
శ్రీలంకతో తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ రనౌటవ్వడం తీవ్ర వివాదస్పదమైంది. శ్రీలంక అరంగేట్ర బౌలర్ కేశర నువంత అడ్డుపడటంతో కిందపడిపోయిన జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్ తప్పిదం కారణంగానే జైస్వాల్ రనౌటయ్యాడని భారత అభిమానులు ఆరోపించారు. శ్రీలంక క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
నిర్లక్ష్యంగా ఉండటంతోనే రనౌట్..
అయితే ఈ రనౌట్‌పై సంజయ్ మంజ్రేకర్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రనౌట్ విషయంలో శ్రీలంకతో పాటు కేఎల్ రాహుల్ తప్పిదం ఏ మాత్రం లేదని, యశస్వి జైస్వాల్ అలసత్వంతోనే మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ మంజ్రేకర్ తన వ్యాఖ్యనంలో యశస్వి జైస్వాల్‌ను తప్పుబట్టాడు. 'అది కచ్చితంగా సింగిల్ అనే నేను అనుకుంటున్నా. కేఎల్ రాహుల్ సునాయసంగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకునేవాడు. కానీ జైస్వాల్ తన లోకంలో తాను లీనమైపోయి నిర్లక్ష్యంగా కనిపించాడు.

అసలేం జరిగిందంటే.?
భారత ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేశర నువంత వేసిన ఈ ఓవర్ ఆఖరి బంతికి యశస్వి జైస్వాల్ రనౌటయ్యాడు. ఈ బంతిని కేఎల్ రాహుల్ మిడాన్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బౌలర్ కేశర డైవ్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. నాన్‌స్ట్రైకర్ యశస్వి జైస్వాల్‌కు అడ్డుగా కేశర డైవ్ చేయడంతో బ్యాలెన్స్ కోల్పోయిన అతను కిందపడిపోయాడు. అప్పటికే సగం క్రీజు ధాటిన రాహుల్ ఆగిపోయాడు.. వెంటనే లేచిన జైస్వాల్ సింగిల్‌కు మూమెంటమ్ ఇచ్చాడు.
దాంతో రాహుల్ నాన్‌స్ట్రైకర్‌వైపు వేగంగా పరుగెత్తాడు. కానీ ఏమైందో ఏమో కానీ జైస్వాల్ కూడా యూటర్న్ తీసుకొని నాన్ స్ట్రైకర్‌వైపు పరుగెత్తాడు. బంతిని అందుకున్న ప్రభాత్.. ఎలాంటి తప్పిదం చేయకుండా కీపర్ నిరోషన్ డిక్‌వెల్లాకు బంతిని అందించాడు. కేశర నువంతపై రాహుల్‌తో పాటు జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ స్కోర్ దిశగా భారత్..
యశస్వి జైస్వాల్(32) ఔటైనా.. కేఎల్ రాహుల్(73 బ్యాటింగ్), దేవదత్ పడిక్కల్(83 నాటౌట్) ఆచితూచి ఆడుతూ.. సెంచరీ దిశగా సాగుతున్నారు. దాంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. అయితే వర్షం అంతరాయం కారణంగా గంటన్నర ఆట తుడిచిపెట్టుకుపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
