అందుకే రోహిత్ శర్మను ఆ ప్రశ్న అడగలేదు: వివాదాస్పద కామెంటేటర్

న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అండగా నిలిచాడు. యువ పేసర్‌ను బ్లేమ్ చేయడం సహేతుకం కాదని భావించే అతను నేలపాలు చేసిన క్యాచ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించలేదని చెప్పాడు. ఆసియకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ లడ్డూ లాంటి క్యాచ్ వదిలి జట్టు ఓటమికి కారణమయ్యాడు.
అసిఫ్ అలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అర్షదీప్ వదిలేయగా.. అతను ధాటిగా ఆడి భారత విజయవకాశాలను దెబ్బతీసాడు. దాంతో అర్షదీప్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు ఆకతాయిలు జాత్యాహంకార వ్యాఖ్యలు కూడా చేశారు. ఖలిస్తానీ మద్దతుదారుడని అతని వికీపీడియా పేజిని ఎడిట్ చేశారు.

నిందించడం కరెక్ట్ కాదు..
ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లంతా అర్షదీప్ సింగ్‌కు అండగా నిలిచారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి హర్భజన్ సింగ్, సచిన్ ఇలా అందరూ అర్షదీప్ సింగ్‌ను వెనుకేసుకొచ్చి ట్రోలర్స్‌కు బుద్దిచెప్పారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ 18 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్షదీప్ సింగ్ ట్రోల్స్‌పై సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు.
అండగా నిలిచే ఉద్దేశంతోనే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో అర్షదీప్ పేరును కూడా ప్రస్తావించలేదని గుర్తు చేశాడు. 'అర్షదీప్ సింగ్ ఆ క్యాచ్ అందుకోవాల్సింది. సాధారణంగా ఒక కన్ను మూసుకొని కూడా 100కు 99 సార్లు ఆ క్యాచ్ పట్టవచ్చు. బహుషా భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ అనే ఒత్తిడి అతని చేత క్యాచ్‌ను నేలపాలు చేయించవచ్చు.

అందుకే అడుగలేదు..
ఇది చాలా కీలకమైన క్యాచ్. అది పట్టుంటే అసిఫ్ అలీ వెనుదిరిగేవాడు. అయితే ఆటలో ఇలాంటివి సహజమే. అందుకే మ్యాచ్ అనంతరం నేను రోహిత్ శర్మను ఈ క్యాచ్ గురించి ప్రశ్నించలేదు. అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని తెలిసినా కూడా ప్రస్తావించలేదు.
ఎందుకంటే ఈ ఒక్క క్యాచ్ కారణంగా మ్యాచ్ ఓడిపోయిందనే వాదన సహేతుకం కాదనేది నా అభిప్రాయం. అర్షదీప్ సింగ్‌ను నిందించడం ఏ మాత్రం సమంజసం కాదు. ఇలాంటి ఒక్క తప్పిదం కారణంగానే ఓడిపోయామనే వాదన కూడా కరెక్ట్ కాదు. ఓటమికి అనేక అంశాలు కారణమవుతాయి.'అని మంజ్రేకర్ అర్షదీప్ సింగ్‌కు అండగా నిలిచాడు.

వికీపిడియాకు ప్రభుత్వం నోటీసులు..
అర్షదీప్ సింగ్ ఖలిస్తాన్ మద్దతుదారుడని వికీపీడియాలో కనిపించడంపై భారత ఐటీ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ కోరుతూ వికీపీడియా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని ఆదేశించింది. ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నతస్థాయి ప్యానెల్ వికీపీడియా ప్రతినిధులను ప్రశ్నించనుంది.
అలాగే, వికీపీడియాకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయనుంది. ఇది చాలా తీవ్రమైన అంశమని, పొరుగు దేశంలో ఎడిట్ అయినట్టు గుర్తించామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి చర్యలు భారత అంతర్గత శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సవరణలను ఎలా అనుమతిస్తారని వికీపీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తామన్నారు.

పాకిస్థాన్‌లో ఎడిట్..
అర్షదీప్ సింగ్ వికీపీడియా పేజీ ఎంట్రీని మార్చి ఖలిస్థాన్ అనే పదాన్ని చేర్చడం వెనక పాకిస్థాన్‌కు చెందిన ఐపీ అడ్రస్ ఉందని ఆరోపించారు. ఆస్క్ అన్షుల్ అనే ట్విటర్ యూజర్.. పాకిస్థాన్‌లో ఎడిట్ అయినట్లు సాక్ష్యాధారాలతో ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌లో ఎడిన చేసిన వారి ఐపీ అడ్రస్‌ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications