Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత చెత్త షాట్ ఇది: సంజయ్ మంజ్రేకర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ విషయాన్ని కోహ్లీ కూడా తెలుసుకుంటాడని చెప్పాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఊరించే ఫుల్‌టాస్‌ను స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీ.. బ్యాట్‌ను అడ్వాన్స్‌గా ఊపి మూల్యం చెల్లించుకున్నాడు. ఆగి వస్తున్న బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

ఫుల్‌టాస్‌కు విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ వికెట్ అనంతరం ... టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. దాంతో అనుభవం కలిగిన కోహ్లీ కాస్త ఆచితూచి ఆడాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Sanjay Manjrekar says Virat Kohli Just Play The Worst Shot Of His Career in 2nd Test vs New Zealand

విరాట్ కోహ్లీ పేలవ బ్యాటింగ్‌పై ట్విటర్ వేదికగా స్పందించిన సంజయ్ మంజ్రేకర్ కెరీర్‌లో అత్యంత చెత్త షాట్ ఆడాడని విమర్శించాడు. 'ఓ డియర్.. తన కెరీర్‌లోనే అత్యంత చెత్త షాట్ ఆడి ఔటయ్యాననే విషయాన్ని విరాట్ కోహ్లీ తెలుసుకుంటాడు. అతను ఇలా ఔటవ్వడం పట్ల నేను కాస్త బాధకు గురయ్యాను. అతను ఎప్పుడూ పరుగులు చేయాలనే తపనతో బరిలోకి దిగుతాడు.'అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్(30), విరాట్ కోహ్లీ(1), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(18), సర్ఫరాజ్ ఖాన్(11),రవిచంద్రన్ అశ్విన్(4), రవీంద్ర జడేజా(38), ఆకాశ్‌దీప్(6), జస్‌ప్రీత్ బుమ్రా(0)లు దారుణంగా విఫలమయ్యారు. రెండు రోజు ఆటలో టీమిండియా 140 పరుగులు చేసి చివరి 9 వికెట్లు కోల్పోయింది.

న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్‌తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. దాంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ డిఫెన్స్ చేయబోయి ఔటవ్వగా.. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ చెత్త షాట్లతో పెవిలియన్ చేరారు.

ప్రత్యర్థి స్పిన్నర్లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ఆడిన భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా ఆడి వస్తున్న బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. టీ బ్రేక్ సమయానికి 20 ఓవర్లలో 2 వికెట్లకు 85 పరుగులు చేసింది. టామ్ లాథమ్(37 బ్యాటింగ్), రచిన్ రవీంద్ర(7 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. డెవాన్ కాన్వే(17), విల్ యంగ్(23), విఫలమయ్యారు. అశ్విన్, సుందర్‌ తలో వికెట్ తీసారు.

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.

Story first published: Friday, October 25, 2024, 14:43 [IST]
Other articles published on Oct 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+