For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ గొప్ప బ్యాటర్ కాదు.. సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల జాబితాలో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు లేదని వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థాయికి రోహిత్ శర్మ చేరుకోలేదన్నాడు. తాజాగా దూరదర్శన్‌లో వచ్చే గ్రేట్ ఇండియన్ క్రికెట్‌ షాలో పాల్గొన్న సంజయ్ మంజ్రేకర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చినా.. దిగ్గజాల స్థాయిని అందుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు.

రోహిత్‌కు ఆ అర్హత లేదు..

'నా అభిప్రాయం ప్రకారం టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ లేడు. అందుకు అతను సరిపోడు. ఎందుకంటే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థాయిని రోహిత్ శర్మ చేరుకోలేదు. అయితే కెప్టెన్‌గా రోహిత్ శర్మకు తిరుగులేదు. అతని స్వార్థరహిత కెప్టెన్సీని కచ్చితంగా కొనియాడాల్సిందే. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ప్రజల్లో అతనిపై ఉన్న ప్రేమ మరింత రెట్టింపు అయ్యింది. అతను ఎప్పుడూ తన గురించి ఆలోచించలేదు. జట్టు కోసం తన స్వప్రయోజనాలను కూడా త్యాగం చేసేందుకు సిద్దమయ్యాడు. అదే అతన్ని పత్యేకంగా నిలబెట్టింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని ఆధిపత్యం చూడముచ్చటగా ఉండేది.

Sanjay Manjrekar Says Rohit Sharma Doesn t Fit Among All-Time Indian Batting Greats

టెస్ట్‌ల్లో రాణించిందేం లేదు..

ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో అలవోకగా 300 పరుగులు చేసేంత ఆధిపత్యం చెలాయించేవాడు. కానీ భారత ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల గురించి మాట్లాడినప్పుడు టెస్ట్ క్రికెట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రెడ్ బాల్ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ అంతగా ప్రభావం చూపలేదు. అందుకే అతను భారత ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడు కాదని చెబుతున్నా.'అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, సచిన్, గవాస్కర్ కంటే కూడా రోహిత్ గొప్ప ఆటగాడు, నాయకుడని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ సారథ్యంలో భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిందని గుర్తు చేస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్‌కు బుద్ది లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు.

టెస్ట్‌ల్లో తక్కువే.. కానీ

సంజయ్ మంజ్రేకర్ చెప్పినట్లు టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మకు గొప్ప రికార్డ్ లేదు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా హిట్ మ్యాన్ కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అతను 19,700 పరుగులు చేశాడు. 67 టెస్ట్‌ల్లో 4301 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. వన్డేల్లో 11, 168 రన్స్ చేశాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోర్ (264) రికార్డ్ కూడా రోహిత్ పేరిటే ఉంది. టీ20లతో పాటు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, September 9, 2025, 16:33 [IST]
Other articles published on Sep 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+