Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆర్‌సీబీ అతన్ని కొనుగోలు చేస్తోంది: సంజయ్ మంజ్రేకర్

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కొనుగోలు చేస్తోందని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు స్వీకరిస్తే చాహల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తాడని చెప్పాడు.

నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. వేలానికి ముందు ఆర్‌సీబీ ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీతో పాటు యశ్ దయాల్, రజత్ పటీదార్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లను కూడా వేలంలోకి వదిలేసింది.

Sanjay Manjrekar Says RCB Will Try to Bring Old Trump Card Back From IPL 2025 Auction

ఆర్‌సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ ఆక్షన్ ప్లాన్స్‌‌పై సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వస్తే జట్టులో చాలా మార్పులు జరుగుతాయి. గతంలో ఆడిన యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకునేందుకు ఆర్‌సీబీ ప్రయత్నిస్తోంది. అయితే చాహల్ విషయంలో ఆర్‌సీబీకి రాజస్థాన్ రాయల్స్ నుంచి పోటీ నెలకొననుంది. చాహల్ కోసం రాజస్థాన్ రాయల్స్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ జట్టు పర్స్ మనీలో రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి చాహల్ కోసం ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకునే ధైర్యం చేయకపోవచ్చు.

గత సీజన్‌లో నిరాశపర్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకోకుండా పక్కనపెట్టింది. అయితే వేలంలో మళ్లీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని అనుకుంటున్నా. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత.

ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే మ్యాక్సీని అడ్డుకోవడం కష్టం. కొత్త ఆటగాడిని తీసుకునే బదులు.. ఫాఫ్ డుప్లెసిస్‌ను తీసుకోవడం ఉత్తమం. సీఎస్‌కే, ఆర్‌సీబీ తరఫున మంచి ఇన్నింగ్స్ ఆడాడు. యువ ప్లేయర్ కంటే సీనియర్. అనుభజ్ఞుడైన డుప్లెసిస్ మంచి ఆప్షన్ అవుతాడు.'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 18, 2024, 18:03 [IST]
Other articles published on Nov 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+