For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sanjay Manjrekar: అప్పుడు నాపై వేటు వేస్తేనే ద్రవిడ్ వచ్చాడు.. రహానే‌ను కూడా పక్కన పెట్టాలి!

Sanjay Manjrekar says If I wasnt dropped, Rahul Dravid and others wouldnt have come in

న్యూఢిల్లీ: నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేను పక్కన పెట్టి, అతని స్థానంలో ఇతర ఆటగాళ్లకు చోటు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ క్రికెటర్‌, వివాదాస్పద కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఫామ్‌లో లేని ఆటగాళ్లు తప్పుకుంటేనే కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయని పేర్కొన్నాడు. అజింక్యా రహానేకు ఉద్వాసన పలకడం ద్వారా హనుమ విహారి, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి వాళ్లకు జట్టులో చోటు దక్కుతుందన్నాడు. ఫామ్‌ కోల్పోయిన తనపై వేటు వేస్తేనే టీమిండియా ది వాల్ రాహుల్ ద్రవిడ్ వచ్చాడని గుర్తు చేశాడు.

రహానే చెత్త బ్యాటింగ్...

రహానే చెత్త బ్యాటింగ్...

కాగా ఓవల్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో అజింక్య రహానే దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే లార్డ్స్ టెస్ట్ హాఫ్ సెంచరీ మినహా అన్నింటిలో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలోని మెల్‌బోర్న్‌ టెస్టులో చివరిసారి సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత ఆడిన 11 టెస్టుల్లో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు. దీంతో రహానే ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి.

నన్ను పక్కనపెడితేనే..

నన్ను పక్కనపెడితేనే..

ఈ క్రమంలోనే రహానేకు ఉద్వాసన పలకాలని భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ సూచించారు. తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ టీవీలో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''జట్టులో చోటు కోసం ఎదురుచూసే వారి గురించి కూడా ఆలోచించాలి. నన్నే ఉదాహరణగా తీసుకోండి. అప్పట్లో నన్ను డ్రాప్‌ చేస్తేనే కదా.. రాహుల్‌ ద్రవిడ్‌, ఇతర ఆటగాళ్లు జట్టులో వచ్చారు. ఇప్పుడు హనుమ విహారి, సూర్యకుమార్‌ యాదవ్‌ పరిస్థితి కూడా అంతే. రహానేలో మునుపటి కాన్ఫిడెన్స్‌ కనిపించడం లేదు. రిజర్వు బెంచ్‌లో ఉన్నవాళ్లకు అవకాశం ఇవ్వాలి''అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

నిజంగా లక్కీనే..

నిజంగా లక్కీనే..

ఇక రహానేకు ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చాయని.. మరో మ్యాచ్‌లో ఆడే అవకాశం గనుక వస్తే అతను నిజంగా అదృష్టవంతుడేనని మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు. 'రహానేకు మరో అవకాశం వస్తే మాత్రం అతనంతా అదృష్టవంతుడు లేడు. గతంలో చాలా మంది ఆటగాళ్లు నిలకడలేమి ఆటతోనే ఉద్వాసనకు గురయ్యారు. అలాంటిది రహానేకు మరో అవకాశం వస్తే నిజంగా లక్కీనే. ఇప్పటికే చాలా అవకాశాలిచ్చారు. అతనిలో ఆత్మవిశ్వాసం కనింపించడం లేదు'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

అద్భుత విజయం..

అద్భుత విజయం..

యాభై ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన టీమిండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఓపెనర్లు హమీద్‌ (63), బర్న్స్‌ (50) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించినా.. ఆ తర్వాత వచ్చినఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. చివరి టెస్టు శుక్రవారం ఆరంభమవుతుంది.

Story first published: Tuesday, September 7, 2021, 17:37 [IST]
Other articles published on Sep 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+