Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డేవిడ్ వార్నర్‌ను పక్కనపెట్టడానికి మరేదో కారణం ఉంది: సంజయ్ మంజ్రేకర్

Sanjay Manjrekar says David Warner getting dropped by SRH has to be due to non-cricketing reasons
David Warner Has Been Dropped For “Non-Cricketing Reason” - Sanjay Manjrekar || Oneindia Telugu

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి డేవిడ్ వార్నర్‌ను పక్కనపెట్టడానికి అతని నిలకడలేమి ఫామ్ ఒక్కటే కారణం కాదని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. టీమ్‌మేనేజ్‌మెంట్, ఆసీస్ స్టార్ మధ్య ఇంకేదో జరిగి ఉంటుందని సందేహం వ్యక్తం చేశాడు. అయితే అదేంటో అంతుచిక్కడ లేదని, కానీ వారి మధ్య ఏదో అయితే జరుగుతుందున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ వరుస పరాజయాలను చవిచూసింది. దాంతో టీమ్ వైఫల్యాలకు బాద్యుణ్ని చేస్తూ.. డేవిడ్ వార్నర్‌పై టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా తుది జట్టులో నుంచి కూడా తప్పించింది. ఆ తర్వాత కేన్ మామ సారథ్యంలో ఒకే ఒక మ్యాచ్ జరగ్గా కరోనాతో లీగ్ అర్ధంతరంగా వాయిదా పడింది.

ఇక యూఏఈ వేదికగా ప్రారంభమైన సెకండాఫ్ లీగ్‌లో వార్నర్‌కు మళ్లీ తుది జట్టులో అవకాశం దక్కింది. జానీ బెయిర్ స్టో చివరి క్షణంలో తప్పుకోవడంతో వార్నర్ సాహాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై మళ్లీ వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ జాసన్‌రాయ్‌కు చాన్స్ ఇచ్చింది. అతను హాఫ్ సెంచరీతో చెలరేగడంతో వార్నర్‌కు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాతి మ్యాచ్‌లకు మైదానంలోకి కూడా వార్నర్ రాలేదు. హోటల్ రూమ్‌కే పరిమితమయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగా ఇన్‌స్టా వేదికగా సంచలన పోస్ట్‌లు షేర్ చేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఇదే నా చివరి సీజన్ కావచ్చన్నాడు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మైదానానికి వచ్చినా.. అతన్ని డగౌట్‌కు అనుమతించలేదు. దాంతో చేసేదేమిలేక ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నాడు. దాంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఈ క్రమంలోనే వార్నర్ వేటుపై సంజయ్ మంజ్రేకర్ ఆసిక్తకర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో చానెల్‌తో మాట్లాడుతూ..ఫ్రాంచైజీ, వార్నర్ మధ్య ఏదో జరుగుతుందన్నాడు. 'సన్​రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు నుంచి వార్నర్​ను తప్పించడానికి క్రికెటేతర కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా అతని ప్రదర్శన మహాద్భుతం. ఐపీఎల్​ చరిత్రలోనే అతడో అత్యుత్తమ బ్యాట్స్​మన్. అతని ఫామ్​ లేమి కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. కాబట్టి క్రికెట్ కారణం కాదు. అదేంటో నాకూ తెలియదు. కానీ, ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తోంది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

ఇక 2013 సీజన్‌ నుంచి వరుసగా ప్రతి సీజన్‌లో 500 పరుగులకు పైగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌.. ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చాంపియన్‌గా నిలిపిన డేవిడ్ భాయ్.. ఇప్పుడు ఇలా వేటుకు గురవ్వడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Story first published: Tuesday, October 5, 2021, 8:15 [IST]
Other articles published on Oct 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+