Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ ‘అపరచితుడు’మీమ్‌పై స్పందించిన సంజయ్ మంజ్రేకర్.. ఏమన్నాడంటే!

Sanjay Manjrekar responds to Ravichandran Ashwin’s hilarious meme over his ‘all-time great’ remark
Ashwin Not In 'All Time Great' జడేజా పోటీపడుతున్నాడు! Manjrekar Raises Questions

హైదరాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ క్రికెటర్, సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అశ్విన్ మంచి స్పిన్న‌రే కావ‌చ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒక‌డు మాత్రం కాద‌ని మంజ్రేక‌ర్ అభిప్రాయపడ్డాడు.

ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయింది. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మంజ్రేకర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. మంజ్రేకర్ అనవసర విషయాలు మాట్లాడుతుంటాడని, అశ్విన్ ముంబై క్రికెట్ అయ్యుంటే మరోలా మాట్లాడేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిబెట్‌పై రవిచంద్రన్ అశ్విన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. దీనికి మంజ్రేకర్ తాజాగా బదులిచ్చాడు.

 అసలు విషయం ఏంటంటే..?

అసలు విషయం ఏంటంటే..?

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో‌కు రాసిన కథనంలో సంజయ్ మంజ్రేకర్‌ అశ్విన్‌పై అభ్యంతరకంగా వ్యాఖ్యలు చేశాడు. 'ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్లలో ఒకడిగా నేను పరిగణించలేను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతడు ఒక్కసారి కూడా 5 వికెట్ల ఘనత సాధించలేదు.

సొంతగడ్డపై తనకు అనుకూలమైన పిచ్‌లపై మాత్రం చెలరేగిపోతాడు. ఇక్కడ కూడా గత నాలుగేళ్లుగా వికెట్ల వేటలో రవీంద్ర జడేజా అతనితో పోటీపడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో స్పిన్‌ పిచ్‌లపై అక్షర్‌ పటేల్‌ అతడికన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ను నిజమైన ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా పరిగణించడంలో ఇవే నా సమస్యలు' అని అభిప్రాయపడ్డాడు.

అలా అన‌కు చారీ..

అలా అన‌కు చారీ..

అయితే ఈ కథనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అటు అభిమానులు.. ఇటు మాజీ క్రికెటర్లు మంజ్రేకర్ కామెంట్స్‌తో విభేధించారు. దాంతో తన కథనం పట్ల వస్తున్న విమర్శలపై సంజయ్ మంజ్రేకర్ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తన దృష్టిలో ఆల్‌టైమ్ గ్రేట్ అంటే.. క్రికెటర్‌కు ఇచ్చే అత్యున్నతమైన ప్రశంస, గుర్తింపని తెలిపాడు.

డాన్ బ్రాడ్ మన్, గ్యారీ సోబెర్స్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరుల్లాంటి వారని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆ జాబితాలోకి రవిచంద్రన్ అశ్విన్ రాలేదని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన అశ్విన్.. త‌మిళ మూవీ అన్నియ‌న్ (అప‌రిచితుడు)లోని ఓ డైలాగ్ మీమ్‌ను పోస్ట్‌ చేశాడు. 'అప్డి సొల్లాదా చారీ, మ‌న‌సెల్ల‌మ్ వ‌లికిర్దు (అలా అన‌కు చారీ.. నా మ‌న‌సు బాధ‌ప‌డుతుంది)' అనే త‌మిళ డైలాగుతో ఉన్న ఫొటోను అశ్విన్ సెటైరిక్‌గా పోస్ట్ చేశాడు.

చారీగారూ నాకు కూడా..

ఈ మీమ్‌పై మంజ్రేకర్ కూడా స్పందించాడు. ఈ రోజుల్లో సూటిగా మాట్లాడితే సహించలేకపోతున్నారని, అది కూడా తనను బాధపెడుతుందని తనదైన శైలిలో బదులిచ్చాడు. 'చారీ గారూ.. క్రికెట్‌కు సంబంధించిన విషయాలను సూటిగా చెబితే చాలా మంది సహించలేకపోతున్నారు. ఇతరుల అభిప్రాయాలపై అనవసర రాద్దం చేస్తున్నారు. వీటన్నిటిని చూస్తే కూడా నా గుండె బరువెక్కుతుంది'అని మంజ్రేకర్ బదులిచ్చాడు.

అశ్విన్ 409

అశ్విన్ 409

ఇప్ప‌టి వ‌ర‌కూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో మొత్తం 30 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అయితే సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మాత్రం ఒక్క‌సారి కూడా అశ్విన్ ఐదు వికెట్లు తీయ‌లేక‌పోడు. ఇక భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా సమరం కోసం యాష్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Story first published: Tuesday, June 8, 2021, 16:56 [IST]
Other articles published on Jun 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+