Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ ఫొటో.. జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ రొమాంటిక్ క్లిక్!!

Jwala Gutta, Vishnu Vishals new romantic click goes viral

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, తమిళ నటుడు విష్ణు విశాల్ గత రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. మొదటలో ఈ విషయాన్ని దాచేసిన ఈ జంట.. జ్వాల గుత్తా పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ప్రపంచానికి చెప్పారు. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని.. ఉంగరాలు మార్చుకున్న ఫొటోలను విశాల్ ట్విట్ట‌ర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దాంతో వారి రిలేషన్‌షిప్ అధికారికంగా వెల్లడైంది.

ప్రస్తుతం జ్వాల గుత్తా, విష్ణు విశాల్ జంట వివాహానికి సిద్ధమవుతోంది. గత నెల తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్న రెండు కుటుంబాలు.. పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. గుత్తా తనకు కాబోయే వరుడి ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ అభిమానులకు కొత్తకొత్త కబుర్లను అందిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఫొటోను గుత్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నా స్వచ్ఛమైన ప్రేమ' అనే కాప్షన్ ఇచ్చారు. సంగీత్ సందర్భంగా తీసిన ఫొటో ఇది. ఫొటోలో విశాల్ సరసన నవ్వులు చిందిస్తూ నిలబడ్డారు. ఆ ఫొటోలో జ్వాలను చూస్తూ అభిమానులు మురిసిపోతున్నారు.

విష్ణు విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాల గుత్తాను కలిశాడు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. ఆపై నిచ్చితార్ధం కూడా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల మద్దతు కూడా వీరికి ఉంది. విశాల్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. మరోవైపు జ్వాలా కూడా అకాడమీతో తీరికలేకుండా ఉన్నారు.

జ్వాల గుత్తా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్య‌న్‌ అనే నాలుగేళ్ల కుమారుడున్నాడు.

Story first published: Saturday, December 12, 2020, 15:28 [IST]
Other articles published on Dec 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+