అందుకే భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యాడు: సంజయ్ మంజ్రేకర్

న్యూఢిల్లీ: తీరికలేకుండా ఆడటంతోనే టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడని మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. భువనేశ్వర్ ఈ ఏడాది వరుసగా ఆడుతున్నాడని, అలసట కారణంగానే అతని బౌలింగ్ లయ తప్పిందని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2022తో పాటు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనూ భువనేశ్వర్ కుమార్ అంచనాలను అందుకోలేకపోయాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతను దారుణంగా విఫలమవుతున్నాడు. టీ20ల్లో కీలకమైన 19వ ఓవర్‌లో ధారళంగా పరుగులిస్తూ జట్టు ఓటములకు కారణమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

అలసటే కారణం..
తాజాగా భువీ ఫామ్‌పై స్పందించిన సంజయ్ మంజ్రేకర్.. అతని వైఫల్యానికి గల కారణాలను వివరించాడు. 'భువనేశ్వర్ బౌలింగ్ లయ తప్పడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది అతను చాలా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లోనూ ఒక్కటి మినహా అన్ని మ్యాచ్‌లు ఆడాడు. భువనేశ్వర్‌ను నేను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నా. అతను పనిభారాన్ని ఎక్కువగా తీసుకునే వ్యక్తి కాదు. ఒకట్రెండు ఫార్మాట్లే ఆడుతాడు. ఇంకో విషయం గమనిస్తే.. విరామం తీసుకుని ఏదైనా టోర్నీలోకి పునరాగమనం చేస్తే తొలి కొన్ని మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తాడు. అందువల్ల భువీ ప్రస్తుత ప్రదర్శన గురించి చెప్పదలచుకున్నది ఏంటంటే.. అతని ఫామ్ తగ్గడానికి అలసటే కారణం'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

మూడో పేసర్‌పై..
ఈ సందర్భంగా టీమిండియాకు మంజ్రేకర్ పలు సూచనలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు మూడో సీమర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. హర్షల్ పటేల్ ఉన్నప్పటికీ సీమ్ బౌలర్‌గా అతనికి కొన్ని పరిమితులున్నాయని తెలిపాడు. ఈ విషయంలో షమీని ఎంచుకోవచ్చని సూచించాడు. గత కొన్ని రోజులుగా డెత్ ఓవర్లలో భువి తేలిపోతున్నాడు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆఖర్లో వేసిన రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు ఇచ్చేశాడు. రెండో మ్యాచ్‌లో భువీకి విరామిచ్చారు. అయితే మూడో టీ20లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో సిరీస్ నుంచి భువికి విశ్రాంతి కల్పించారు.

రేపటి నుంచి షురూ..
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28 (బుధవారం) తిరువనంతపురం వేదికగా జరుగుతుంది. అలాగే రెండో టీ20 మ్యాచ్ గౌహతి వేదికగా అక్టోబర్ 2 (ఆదివారం), చివరి టీ20 ఇండోర్ వేదికగా అక్టోబర్ 4 (మంగళవారం)న జరగనుంది. ప్రతి మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications