Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీని టెస్ట్‌ల్లో ఆడించడం అన్యాయం: సంజయ్ మంజ్రేకర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల మోత మోగించిన టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. వైభవ్ సూర్యవంశీని స్వేచ్ఛగా ఆడనివ్వాలని, టెస్ట్ క్రికెట్‌లోకి తీసుకోవాలని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భారత సెలెక్టర్లకు సూచించాడు. వైభవ్.. సచిన్, విరాట్ కోహ్లీలా భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతాడని ఇతర మాజీ క్రికెటర్లు జోస్యం చెప్పారు.

అయితే వైభవ్ సూర్యవంశీని నేరుగా టెస్ట్ క్రికెట్ ఆడించడం సరికాదని వివాదాస్పద కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. వైభవ్ సూర్యవంశీని తొందరపడి భారత టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవద్దని సూచించాడు. టీ20 ప్రదర్శన ఆధారంగా టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవడం అన్యాయమని అభిప్రాయపడ్డాడు.

కోట్లు పెట్టి డమ్మీ ఆటగాళ్లను కొంటున్నారు: సునీల్ గవాస్కర్

కోట్లు పెట్టి డమ్మీ ఆటగాళ్లను కొంటున్నారు: సునీల్ గవాస్కర్

టెస్ట్‌ల్లోకి తీసుకోవడం సరికాదు..

'సంజు శాంసన్, అభిషేక్ శర్మ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకోవాల్సిన తర్వాతి ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అనడంలో సందేహం లేదు. అయితే అతన్ని టీమిండియాలోకి తీసుకుంటే ఆసియా పిచ్‌లపై మాత్రమే ఆడించాలి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి కఠినమైన క్రికెట్ మైదానాల్లో వైభవ్‌ను నేరుగా బరిలోకి దించడం సరైన నిర్ణయం కాదు.

Sanjay Manjrekar Advises Vaibhav Sooryavanshi to Prove Himself in Ranji Trophy Before India Team Call-Up

టెస్ట్ క్రికెట్‌లో అతని ప్రదర్శన ఎలా ఉంటుందోనని చాలా మంది చర్చిస్తున్నారు. అయితే, అతనికి దారి చూపడం బీసీసీఐ పని కాదు. మన పని కూడా కాదు. అతను స్వతంత్ర వ్యక్తి, తన కెరీర్‌లో ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నాడో అతనే నిర్ణయించుకోవాలి. ఐపీఎల్, టీ20 ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం సరైనది కాదు.

వారిని కాదని ఆడించడం అన్యాయం..

బీహార్ రంజీ జట్టులో అనేక మంది ఆటగాళ్లు ఏళ్ల తరబడి కఠోర శ్రమతో ఆడుతున్నారు. వారి కృషిని విస్మరించి, కేవలం టీ20 ప్రదర్శన ఆధారంగా వైభవ్ సూర్యవంశీని టెస్ట్‌ టీమ్‌లోకి తీసుకోవడం అన్యాయం. ఒకవేళ వైభవ్ టెస్టు క్రికెట్‌లలో రాణించాలనుకుంటే.. ముందుగా అతను రంజీ జట్టులో తన స్థానం కోసం పోరాడి, స్వశక్తితో ఆ అవకాశాన్ని దక్కించుకోవాలి.’అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌ల్లో 237.71 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు సార్లు శతకం చేసుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ప్లేఆఫ్స్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 97, 96 పరుగులు చేశాడు.

ఆరెంజ్ క్యాప్‌తో పాటు మొత్తం ఐదు అవార్డులను అందుకున్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ఏ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. జూన్ 9 నుంచి శ్రీలంకలో ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్ 'ఏ', శ్రీలంక 'ఏ' జట్లతో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్ బరిలోకి దిగనున్నాడు.

Vaibhav Sooryavanshi: యాడ్స్ రేటు పెంచేసిన బుడ్డోడు!

Vaibhav Sooryavanshi: యాడ్స్ రేటు పెంచేసిన బుడ్డోడు!
Story first published: Tuesday, June 2, 2026, 15:43 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+