Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanjana Ganesan: నా మొగుడు గొప్ప బౌలర్.. బుమ్రా సతీమణి ఫన్నీ పోస్ట్!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అతని సతీమణి సంజనా గణేషన్ ప్రశంసల జల్లు కురిపించింది. తన భర్త గొప్ప బౌలర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడింది. అయితే కాస్త ఫన్నీగా ఈ పోస్ట్ పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో బుమ్రా నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో తాత్కలిక సారథిగా బుమ్రా జట్టును నడిపించాడు.

Sanjana Ganesan praises Jasprit Bumrah s spell in Perth unique way

అటు కెప్టెన్‌గా.. ఇటు బౌలర్‌గా బుమ్రా దుమ్మురేపాడు. నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ నడ్డి విరిచాడు. బుమ్రా(4/17)తో పాటు మహమ్మద్ సిరాజ్(2/17), హర్షిత్ రాణా(1/33) నిప్పులు చెరగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 7 వికెట్లకు 67 పరుగులే చేసింది.

బుమ్రా బౌలింగ్‌ ధాటికి ఉస్మాన్ ఖవాజా(8), నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) పెవిలియన్ చేరగా.. మార్నస్ లబుషేన్(2), మిచెల్ మార్ష్‌(6)లను సిరాజ్ ఔట్ చేశాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్‌(6)ను అరంగేట్ర పేసర్ హర్షిత్ రానా క్లీన్ బౌల్డ్ చేశాడు.

క్రీజులో మిచెల్ స్టార్క్(6 బ్యాటింగ్)తో పాటు అలెక్స్ క్యారీ(19 బ్యాటింగ్) ఉన్నాడు. ఆసీస్ ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్ ఆలౌట్ చేసి భారత్ 50 పరుగుల ఆధిక్యం సాధిస్తే.. ఈ మ్యాచ్‌పై పట్టుబిగుస్తోంది. శనివారం జరిగే ఆటే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, అరంగేట్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/14), ప్యాట్ కమిన్స్(2/67), మిచెల్ మార్ష్(2/12) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో సత్తా చాటి టీమిండియా పై చేయి సాధించింది. ముఖ్యంగా బుమ్రా కెప్టెన్సీ అందర్నీ ఆకట్టుకుంది.

ముగ్గురు పేసర్లతోనే 27 ఓవర్లు వేయించిన బుమ్రా.. కెప్టెన్‌గా ముందుండి వికెట్లు తీసాడు. అతని ఫీల్డ్ సెటప్ కూడా స్పాటాన్ ఉంది. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. ఈ క్రమంలోనే అతని సతీమణి సంజనా గణేషన్ కూడా ఇన్‌స్టా స్టోరీలో బుమ్రాను కొనియాడింది. ఈ పోస్ట్‌లో అతని పిరుదల గురించి ప్రస్తావిస్తూ నవ్వులు పూయించింది. 'బుమ్రా గొప్ప బౌలర్. అతని పిరుదులు కూడా'అనే క్యాప్షన్‌తో బుమ్రా బట్టక్స్ కనిపించే ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Friday, November 22, 2024, 21:02 [IST]
Other articles published on Nov 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+