Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జనం చస్తుంటే ఈ వంటకాలేంది.. సెలబ్రిటీలపై సానియా ఫైర్

Sania Mirza Says Arent we done with posting cooking videos and food pictures yet

హైదరాబాద్: కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం అల్లాడుతుంది. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి దేశాలన్నీ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ మహమ్మారి బారిన పడి కొందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేయాల్సింది పోయి వంటావార్పులు చేసుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్న సెలబ్రిటీలపై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది సరైందేనా?

‘మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్‌ పూర్తయ్యిందా లేదా? ఒక్కసారి ఆలోచించండి... మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో ఈ వంట వీడియోలు షేర్‌ చేయడం సరైందేనా?' అని సానియా అసహనం వ్యక్తం చేసింది.

క్రీడాకారులతో మోదీ కాన్ఫరెన్స్..

క్రీడాకారులతో మోదీ కాన్ఫరెన్స్..

కరోనాపై యుద్ధంలో కలిసి రావాలని ప్రధాని మోదీ దేశ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రధాని మోదీ 49 మంది భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాను జయించేందుకు వారి సూచనలు, సలహాలు కోరిన సంగతి తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్‌లో సానియా కూడా పాల్గొంది.

ఈ మహమ్మారిపై భారత్‌ యావత్తూ పోరాడుతోందని..ఇందులో ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకమైనదని మోదీ పేర్కొన్నారు. 21 రోజుల లాక్‌డౌన్‌ తరుణంలో మీరు (క్రీడాకారులు)నింపే స్ఫూర్తితో కొవిడ్‌-19పై సమరంలో దేశమంతా మరింత చైతన్యమవుతుందన్నారు. ప్రధానితో మాట్లాడిన వారిలో సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, సౌరవ్‌ గంగూలీ, పీవీ సింధు, అథ్లెట్‌ హిమాదాస్‌, మహిళా హాకీ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి అంకితా రైనా, కబడ్డీ ఆటగాడు అజయ్‌ ఠాకూర్‌, పారా అథ్లెట్‌ శరద్‌ కుమార్‌ తదితరులున్నారు.

సానియా సాయం రూ. 1.25 కోట్లు..

సానియా సాయం రూ. 1.25 కోట్లు..

క‌రోనా‌పై పోరాటానికి సానియా తనవంతు సాయాన్ని ప్రకటించింది. పూట గ‌డువ‌ని ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నకుటుంబాలను ఆదుకునేందుకు ఈ హైదరాబాద్ టెన్నిస్ స్టార్ 1.25 కోట్లను విరాళాలుగా సేక‌రించింది. వీటి ద్వారా అన్నార్థుల‌కు స‌హాయం చేయ‌నుంది. ఈ విష‌యాన్ని సానియా సోమవారం త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. 'కరోనాతో తిన‌డానికి తిండి లేకుండా రోడ్డున ప‌డ్డ వారి కోసం ఏమ‌న్న చేయాల‌న్న తపనతో కొందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్ప‌డ్డాం. వారం వ్య‌వధిలో కోటి 25 ల‌క్ష‌ల‌తో వేల కుటుంబాలకు అన్న‌దానం చేయ‌నున్నాం. ఈ డ‌బ్బుతో దాదాపు ల‌క్ష మందికి స‌హాయం అందుతుంది. దీన్ని మేమంద‌రం క‌లిసి ఇంకా కొన‌సాగిస్తాం. @యూత్‌ఫీడ్ఇండియా @సేఫ్ఇండియా' అంటూ సానియా ట్వీట్ చేసింది.

భారత్ గెలవాలి..

భారత్ గెలవాలి..

ఇటీవలే కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ కామెడీ షోకు సానియా మీర్జా హాజరైంది. ఈ సందర్బంగా సాగిన ఇంటర్వ్యూ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. కపిల్ శర్మ అడిగిన ప్రశ్నలకు సానియా చురుగ్గా సమాధానాలు ఇచ్చింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నడుస్తుంటే.. ఎవరు గెలువాలని కోరుకొంటారు అని ప్రశ్నకు సానియా సమాధానం ఇస్తూ.. ఇది అడగాల్సిన ప్రశ్నేనా? నేను ఎఫ్పుడు ఇండియానే గెలువాలని కోరుకొంటాను. కానీ నా భర్త షోయబ్ మాలిక్ మాత్రం సెంచరీ కొట్టాలని కోరుకొంటాను అని సానియా జవాబు ఇచ్చింది.

Story first published: Sunday, April 5, 2020, 9:37 [IST]
Other articles published on Apr 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+