SRH జట్టుపై సానియా మీర్జా తండ్రి ఫైర్.. ఆత్మపరిశీలన చేసుకోవాలని చురక!

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థానిక ఆటగాళ్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీ అవకాశం ఇవ్వలేదని మండిపడ్డాడు. టీమ్ పెర్ఫామెన్స్ చూస్తుంటే ఈ సీజన్‌లో జట్టు ఎక్కువ విజయాలు నమోదు చేసేటట్లు కనిపించడంలేదన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఓ దశలో 16 ఓవర్లలో 115/2 పరుగులతో పటిష్టంగా కనిపించింది. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 35 పరుగులు చేయాలి. క్రీజులో మనీష్ పాండేతో పాటు బెయిర్ స్టో(12) ఉన్నాడు. ఇక సన్‌రైజర్స్ విజయం లాంఛనమే అని అంతా భావించారు. కానీ ఆర్‌సీబీ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ అద్భుతం చేశాడు. ఒక్క పరుగు ఇచ్చి ఆరు బంతుల తేడాలో బెయిర్ స్టో, పాండే, సమద్‌లను పెవిలియన్‌కు పంపాడు. దాంతో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో హైదరాబాద్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇక కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ గెలుపు ముంగిట బోల్తా పడిన విషయం తెలిసిందే.
ఒక్క ప్లేయర్‌ను తీసుకోరా?
ఈ బ్యాక్ టు బ్యాక్ ఓటమిలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఇమ్రాన్ మీర్జా టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. జట్టులోకి తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్లేయర్ కూడా కనిపించలేదా? అని ప్రశ్నించాడు. అంతేకాకుండా ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా విజృంభిస్తున్న వేళ అత్యంత సురక్షితమైన హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం విస్మయపరిచిందననాడు. సన్‌రైజర్స్ ఆటతీరు చూస్తుంటే కొన్ని విజయాలతో ఈ సీజన్‌ను ముగించేటట్లుందని, అంతేకాకుండా సొంత అభిమానుల మద్దతు కోల్పోయే అవకాశం కూడా ఉందని హెచ్చరించాడు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు..
హైదరాబాద్ బేస్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కనీసం ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు. గత సీజన్‌లో భావనక సందీప్‌ను తీసుకున్నా.. అతని ఆడే అవకాశం రాకపోగా.. ఈ సీజన్‌లో వదిలేసింది. ఇక వేలంలో ఏ ఆటగాడిని తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే సన్‌రైజర్స్‌పై విమర్శలు వచ్చాయి. ఇక టీమ్ పెర్ఫమెన్స్ కూడా అంతంత మాత్రమే ఉండటంతో ఈ విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్ సిరాజ్ ఆర్‌సీబీకి ఆడుతుంటే అంబటి రాయుడు, హరిశంకర్ రెడ్డి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గెలిచే మ్యాచ్‌లో
నిన్నిటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు. అపంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54), మనీశ్ పాండే(39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. కైల్ జేమీసన్‌కు ఓ వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications