Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిన్ను చంపేస్తా.. బాబర్ ఆజమ్‌కు సానియా మీర్జా వార్నింగ్!!

Sania Mirza responds to Babar Azams choice of favourite bhabi during chat with Shoaib Malik


హైదరాబాద్: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్, టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌కు పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ సతీమణి, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వార్నింగ్ ఇచ్చారు. 'బాబర్‌.. నిన్ను చంపేస్తా' అని సానియా గట్టి వార్నింగ్ ఇచ్చారు. షోయబ్ మాలిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో బాబర్ అజామ్ మాట్లాడుతుండగా.. ఇలా సానియా నుండి హెచ్చరిక వెళ్ళింది. ఇంతకు సానియా.. ఆజమ్‌కు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అని అనుకుంటున్నారా?. విషయంలోకి వెళితే..
మాలిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్:

మాలిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్:

ఆదివారం పాకిస్తాన్ జట్టు మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లనుంది. ఈ సందర్భంగా పాక్ వన్డే, టీ20 కెప్టెన్ బాబర్ అజామ్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో షోయబ్ మాలిక్‌తో మాట్లాడాడు. మాలిక్ అడిగిన ప్రొఫెషనల్ ప్రశ్నలకి బాబర్ సమాధానాలు ఇస్తూ వస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత పర్సనల్ విషయాల గురించి ప్రశ్నలు వేసాడు మాలిక్. 'పాక్ జట్టులోని క్రికెటర్ల ఫ్యామిలీస్‌తో నీకు మంచి అనుబంధం ఉంది కదా బాబర్' అని మాలిక్ అడగ్గా.. 'అవును చాలా' అని పాక్ కెప్టెన్ బదులిచ్చాడు.

ఐ విల్‌ కిల్‌ యూ:

ఐ విల్‌ కిల్‌ యూ:

పాక్ జట్టులో 'నీకిష్టమైన వదిన ఎవరు'? అని బాబర్ ఆజమ్‌ను షోయబ్‌ మాలిక్ ప్రశ్నించగా... ఏమాత్రం ఆలోచించకుండా మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భార్య సైదా ఖుస్బత్ పేరుని చెప్పాడు. సానియాతో అజామ్‌కి మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న కారణంగా ఆమె పేరుని చెప్తాడని ఊహించిన మాలిక్‌కి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇక లైవ్‌ చూస్తున్న సానియా.. 'ఐ విల్‌ కిల్‌ యూ' అని మెసేజ్‌ పెట్టారు. అంతేకాకుండా ఇక నుంచి షోయబ్‌ ఇంటిలోని సోఫాను ఉపయోగించుకోనీయమని కూడా బాబర్‌పై చిరుకోపాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది.

 ఐదు నెలలుగా దూరం:

ఐదు నెలలుగా దూరం:

అమెరికాకు టెన్నిస్ టోర్నమెంట్ కోసం వెళ్లిన సానియా మీర్జా లాక్‌డౌన్ ముందు హైదరాబాద్ చేరుకోగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ షోయబ్ మాలిక్ అక్కడే చిక్కుకుపోయాడు. లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయంగా విమానాల నిలిపివేతతో దాదాపు ఐదు నెలలుగా సానియా, షోయాబ్‌లు దూరంగా ఉంటున్నారు. దీంతో కొన్ని రోజులు కుటుంబంతో గడిపిన తర్వాత ఇంగ్లండ్ టూర్‌కి వెళ్తానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి పర్మీషన్ కూడా తెచ్చుకున్నాడు మాలిక్. సానియా మీర్జా, షోయబ్‌ మాలిక్‌ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్‌లో సంప్రదాయ పద్దతిలో మాలిక్‌ను సానియా వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతని పేరు ఇజాన్ మీర్జా మాలిక్.

 నెల రోజులు గడిపిన తర్వాత:

నెల రోజులు గడిపిన తర్వాత:

పాకిస్తాన్ జట్టు ఈ నెల 28న మాంచెస్టర్ బయలుదేరుతుంది. భార్య, కుమారుడితో దాదాపు నెల రోజులు గడిపిన తర్వాత వచ్చే నెల 24న షోయాబ్‌ మాలిక్‌ ఇంగ్లండ్‌లో ఉన్న జట్టుతో చేరుతాడు. పాక్ జట్టు డెర్బీషైర్ వెళ్ళే ముందు 14 రోజుల క్వారంటైన్‌ సమయంలో ప్రాక్టీస్ చేయనున్నారు. ప్రాక్టీస్‌ చేసేందుకు స్థానిక జట్లు అందుబాటులో లేకపోవడంతో.. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇంగ్లండ్‌తో పాక్ మూడు టెస్టులు, మూడు ట్వంటీ20 మ్యాచులు ఆడనుంది.

సన్‌రైజర్స్‌కు ఆడటమే నా కెరీర్లో పెద్ద మలుపు: స్టార్ పేసర్

Story first published: Saturday, June 27, 2020, 8:37 [IST]
Other articles published on Jun 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+