Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌కు ఆడటమే నా కెరీర్లో పెద్ద మలుపు: స్టార్ పేసర్

Bhuvneshwar Kumar Credits Sunrisers Hyderabad For His Success On The International Stage


ఢిల్లీ:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడటమే తన కెరీర్లో పెద్ద మలుపని టీమిండియా ఫాస్ట్ ‌బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. సన్‌రైజర్స్‌ విజయాల్లో భువనేశ్వర్‌ కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేక్‌ అందించడంలో అతనికి అతనే సాటి. లీగ్‌లో సాగించిన ఈ తరహా ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా నేర్చుకున్నానని భువీ పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్‌కు ఆడటమే కెరీర్లో పెద్ద మలుపు:

సన్‌రైజర్స్‌కు ఆడటమే కెరీర్లో పెద్ద మలుపు:

తాజాగా భువనేశ్వర్‌ కుమార్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... 'యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. అయితే మధ్యలో ఆ కళ పోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మారాక ఇన్నింగ్స్‌ ఆరంభంలో, చివర్లో బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. యార్కర్లపై మళ్లీ పట్టు సాధించా. 2014లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నా. డెత్‌ బౌలింగ్‌లో నైపుణ్యం సంపాదించా. అదే నా కెరీర్లో మలుపు' అని అన్నాడు. 2014 నుంచి సన్‌రైజర్స్‌ తరఫున ఆడుతున్న భువీ.. 6 సీజన్లలో 86 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు పడగొట్టాడు.

చివరికి ధోనీ ఉన్నా:

చివరికి ధోనీ ఉన్నా:

2013 నుంచీ ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి అసలైన కారణం గుర్తించడం కష్టమని.. దురదృష్ట సంఘటనలు, ఇతర కారణాల వల్లే తాము ఓడిపోయామని‌ భువనేశ్వర్‌ కుమార్‌ అభిప్రాయపడ్డాడు. '2015 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో చేతిలో సెమీస్‌లో ఓటమిపాలయ్యాం. గతేడాది న్యూజిలాండ్‌తో తలపడిన సందర్భంగా ఆదిలోనే టాప్ ‌ఆర్డర్‌ కుప్పకూలింది. దాంతో మ్యాచ్‌ను కోల్పోయాం. ప్రత్యర్థిని 250లోపే కట్టడి చేసినా.. టాప్ ‌ఆర్డర్‌ ఇలా విఫలమవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆ ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఐదు శతకాలతో చెలరేగిపోయాడు. కేఎల్‌ రాహుల్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ సైతం బాగా ఆడాడు. చివరికి ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. అయినా ఓటమిపాలయ్యాం' అని భువీ చెప్పాడు.

 లాక్‌డౌన్‌ ఇంతకాలం ఉంటుందని ఊహించలేదు:

లాక్‌డౌన్‌ ఇంతకాలం ఉంటుందని ఊహించలేదు:

మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ లాగే తాను కూడా మ్యాచ్‌ ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆటగాడిగా ఎదగడం గురించి ఆలోచిస్తానని.. అది మంచి ఫలితాలందించిందని మధ్యప్రదేశ్‌ పేసర్ భువనేశ్వర్‌ ‌పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ ఇంతకాలం ఉంటుందని ఊహించలేదని.. కసరత్తుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా కొన్ని పరికరాలు తెప్పించుకుని ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నానన్నాడు. భువీ భారత్ తరఫున 21 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు.

233 సంవత్సరాలలో తొలిసారి.. ఎంసీసీ పీఠంను అధిష్టించనున్న మహిళ!!

Story first published: Saturday, June 27, 2020, 7:52 [IST]
Other articles published on Jun 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+