T20 World Cup 2021 నుంచి భారత్ ఔట్.. పాకిస్థాన్ విజయాలను ఆస్వాదిస్తున్న సానియా మీర్జా!

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకు గుండెకోతను మిగుల్చుతూ టీమిండియా కనీసం సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగింది. అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే ఎంచక్కా భారత్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత ఆశలను చిదిమేస్తూ అప్గాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. దాంతో భారత్ ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక టీ20 ప్రపంచకప్ రేసు టీమిండియా అధికారికంగా తప్పుకోవడంతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రెక్కలు వచ్చాయి.
మాలిక్ బ్యాటింగ్ ఆస్వాదిస్తూ..
ఇప్పుడు ఆమె తన భర్త షోయబ్ మాలిక్ టీమ్ పాకిస్థాన్ విజయాలను ఆస్వాదించే పనిలో పడింది. ప్రస్తుతం తన భర్తతో పాటు పాకిస్థాన్ టీమ్ బయో బబుల్‌లో ఉన్న సానియా.. పాక్ జైత్రయాత్రను ఆస్వాదిస్తోంది. ఇన్నాళ్లు భారత అభిమానులకు భయపడో లేక మాతృదేశంపై ఉన్న ప్రేమనో తెలియదు కానీ పాకిస్థాన్ మ్యాచ్‌లకు హాజరవ్వకుండా హోటల్ గదికే పరిమితమైంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో అయితే గత అనుభవాల దృష్ట్యా సోషల్ మీడియాకే దూరంగా ఉంటానని ప్రకటించింది. అయితే ఆదివారం అఫ్గాన్‌పై న్యూజిలాండ్ గెలవడం.. భారత్ అధికారికంగా రేసు నుంచి తప్పుకోవడంతో సానియా పాక్- స్కాట్లాండ్ మ్యాచ్‌కు హాజరైంది.
ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు..
ఈ మ్యాచ్‌లో తన భర్త షోయబ్ మాలిక్ వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదగా.. ఆ క్షణాలను గ్యాలరీలో నుంచి ఆస్వాదించింది. చప్పట్లతో అతని ఆటను అభినందించింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే సానియా చేసిన ఈ పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌కు సపోర్ట్ చేయడాన్ని కొందరు తప్పుబడుతుంటే మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. తన సొంత దేశం టోర్నీ నుంచి తప్పుకున్నప్పుడు తన భర్తకు అండగా నిలిచే హక్కు ఆమెకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. 'టీ20 ప్రపంచకప్ నుంచి సానియా మీర్జా టీమ్ తప్పుకోవడంతో ఆమె తన భర్త బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తుంది'అని ఓ అభిమాని ఫొటోలతో సహా ట్వీట్ చేశాడు.

పాక్ సూపర్ విక్టరీ..
ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు సూపర్ 12 లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ 1 టాపర్‌గా నిలిచింది. అందరికన్నా ముందే సెమీస్ చేరిన బాబర్ సేన.. ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 72 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. ఈ ఐదు విజయాలతో నాకౌట్ మ్యాచ్‌లకు ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచుకుంది. ఐదు ఓటములతో స్కాట్లాండ్ పాయింట్ల ఖాతానే తెరువలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది.

18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
కెప్టెన్ బాబర్ ఆజమ్(47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66) హాఫ్ సెంచరీతో తన ఫామ్ కొనసాగించగా.. వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(18 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 54 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. ఈ ఇద్దరికి మధ్యలో మహమ్మద్ హఫీజ్(31) కూడా రాణించాడు. చివరి ఓవర్లోనే మాలిక్ 26 పరుగులు పిండుకోవడం విశేషం. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రేవ్స్(1/43) రెండు వికెట్లు తీశాడు. 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన మాలిక్ ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్ గ్రీవ్స్‌ను వణికిస్తూ వరుసగా 6,4,6,6తో 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (18 బంతుల్లో) సాధించిన షోయబ్ మాలిక్... టీ20 ప్రపంచకప్‌ల్లో కేఎల్ రాహుల్, మ్యాక్స్‌వెల్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications